వైసీపీ ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డి సారథ్యంలో అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గ సామాజిక సాధికార యాత్ర సాగింది. రాజంపేట బస్సు యాత్ర బహిరంగ సభలో డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, మంత్రి మేరుగు నాగార్జున, మాజీ ఎంపీ బుట్టా రేణుకతోపాటు పలువురుఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. చంద్రబాబు ప్రభుత్వంలో మైనార్టీలకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదని ఆరోపించారు ఏపీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా. వైసీపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పదవితోపాటు మైనార్టీలను ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు.
అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో వైసీపీ సామాజిక సాధికార యాత్ర కొనసాగింది. చోడవరం బహిరంగ సభలో వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జ్ వైవీ సుబ్బారెడ్డి, డిప్యూటీ సీఎం రాజన్నదొర, మంత్రులు గుడివాడ అమర్నాథ్, ధర్మాన ప్రసాదరావు, కారుమూరి నాగేశ్వరరావు, ఎంపీ నందిగం సురేష్‌తోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో కొందరు అబద్దపు హామీలతో మోసం చేసేందుకు వస్తున్నారని, వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు వైసీపీ నేతలు. బీసీలకు సముచిత స్థానం కల్పించిన నేత సీఎం జగన్ అన్నారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.
మొత్తంగా.. ఏపీలో వైసీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక సాధికార యాత్రతో పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. వైసీపీ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు జరిగిన మేలును వివరిస్తున్నారు మంత్రులు, ప్రజాప్రతినిధులు.
అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో నిర్వహించిన వైయస్ఆర్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి జగనన్న ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం @ysjagan గారు నాలుగున్నరేళ్లలో చేసిన మంచిని వైయస్ఆర్సీపీ నాయకులు ప్రజలకు వివరించారు.… pic.twitter.com/N7Py6CVBsK
— YSR Congress Party (@YSRCParty) December 12, 2023
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి