
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష 2023ల ఫలితాలు మంగళవారం (జూన్ 13) విడుదలకానున్నాయి. విజయవాడలో రేపు సాయంత్రం 5 గంటలకు ఇంటర్ ప్రథమ, ద్వితయ సంవత్సరాల ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. సప్లిమెంటరీ పరీక్షలకు హాజరైన విద్యార్ధులు ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ లో, టీవీ9 తెలుగు వెబ్‌సైట్‌లలో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
కాగా ఈ ఏడాది ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు జరిగిన సంగతి తెలిసిందే. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలు జరిగాయి. వీటికి సంబంధించిన ఫలితాలు రేపు విడుదల చేస్తామని ఈ సందర్భంగా ఇంటర్ బోర్డు ప్రకటన వెలువరించింది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.