Andhra pradesh: అచ్చం ‘అరుణాచలం’ సినిమానే.. ఒక్క రోజులో రూ. 50 లక్షలు ఖర్చు చేయాలి.. ఎక్కడంటే..!

|

Mar 31, 2022 | 5:34 AM

Andhra pradesh: ఖర్చు చేయడానికి డబ్బుంటే, టైం ఉండదు. సమయం ఉంటే డబ్బులు ఉండవు. ఇదేదో సినిమా డైలాగ్‌ అనుకుంటున్నారా? కాదు,

Andhra pradesh: అచ్చం ‘అరుణాచలం’ సినిమానే.. ఒక్క రోజులో రూ. 50 లక్షలు ఖర్చు చేయాలి.. ఎక్కడంటే..!
Money
Follow us on

Andhra pradesh: ఖర్చు చేయడానికి డబ్బుంటే, టైం ఉండదు. సమయం ఉంటే డబ్బులు ఉండవు. ఇదేదో సినిమా డైలాగ్‌ అనుకుంటున్నారా? కాదు, ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చిన ప్రాబ్లం. అరుణాచలం సినిమా అందరికీ గుర్తుంది కదా. ఆ సినిమాలో సూపర్‌స్టార్‌ రజినీకాంత్, 30 రోజుల్లో 30 కోట్లు ఖర్చు చేయాలి. లేదంటే వచ్చే మూడు వేల కోట్లు రావు. అయితే, అది రీల్‌ లైఫ్‌. కానీ రియల్‌ లైఫ్‌లోనూ లక్షల డబ్బులు ఇచ్చి ఒక్క రోజులోనే ఖర్చు చేయండి అంటే ఏం చేస్తాం. చాలా కష్టం కదా. అచ్చం అలాంటి సమస్యే వచ్చిపడింది అనంతపురం జిల్లా అధికారులకు. ఒక్క రోజులో 50 లక్షలు ఖర్చు చేయాలని ఆదేశాలు వచ్చాయి. అనంతపురం జిల్లా ఐసీడీఎస్ ఖాతాకు రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నుంచి 50 లక్షల రూపాయలు వచ్చాయి. కానీ, ఒక్క రోజులో 50 లక్షలు ఖర్చు చేయాల్సి వచ్చింది.

అయితే, అధికారులు డబ్బులు ఖర్చు చేయడం చాలా ఈజీ కదా అనుకుంటే పొరపాటే. ఇక్కడే అసలు ట్విస్ట్‌ ఉంది. అంతా రూల్ ప్రకారం జరగాలి. ఖర్చుకు సంబంధించిన బిల్లులు ట్రెజరీకి సమర్పించాలి. ఇలాంటి తతంగం ఇంకా చాలా ఉంటుంది. అయితే, అంత డబ్బు ఒకేసారి ఎందుకొచ్చిందంటే, ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న టైంలో డబ్బులు విడుదల చేసింది ప్రభుత్వం. డబ్బులన్నీ ఖర్చు చేయాలని, లేకుంటే వెనక్కి వెళ్లిపోతాయని ఆదేశాలు వచ్చాయి. దీంతో ఇదంతా ఒక్క రోజులో జరిగే పనేనా అంటూ తల పట్టుకుంటున్నారు అధికారులు. ఇలా ఒక్కసారిగా ఇంత డబ్బులు ఇచ్చి ఖర్చు చేయాలంటే ఎలా అని అధికారులు వాపోతున్నారు. ఇక చేసేదేమీ లేక 50 లక్షలు ఖర్చు చేసే పనిలోపడ్డారు. ఏం కావాలి, ఏది కొంటే ఎంత అవుద్ది అనే లెక్కల్లో మునిగితేలుతున్నారు. ఫస్ట్‌ అయితే, ఆఫీస్‌ అవసరాలకు కావాల్సిన వస్తువులు కొనుగోలు బిల్లులు సమర్పించాలని డిసైడ్ అయ్యారు. ప్రతిపాదనలు పంపినప్పుడు డబ్బులు ఇస్తే బాగుండేదని అంటున్నారు అనంతపురం జిల్లా అధికారులు.

Also read:

Astro Tips: ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారా?.. యాలకులతో ఇలా చేస్తే డబ్బే డబ్బు..!

Banks Holidays: బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. ఏప్రిల్‌లో బ్యాంకులకు 15 రోజులు సెలవులు.. వివరాలివే..!

Big News Big Debate: 40 ఏళ్ల తెలుగుదేశం.. భవిష్యత్తుకు ఏది అభయం.. ప్రత్యేక కథనం..!