AP Municipal Elections 2021: ఆత్మకూర్ మున్సిపల్ ఎన్నికల్లో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. డబ్బులు ఇస్తేనే తమ ఓట్లు వేస్తాము లేకపోతే వెయ్యమంటూ 32 కుటుంబాల ఓటర్లు పోలింగ్ కేంద్రం వద్ద భీష్మించి కూర్చున్నారు. వివరాల్లోకెళితే.. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డుకు చెందిన 32 కుటుంబాలకు చెందిన గిరిజన ఓటర్లు పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చారు. తమ పక్కవార్డులో ఉండే ఓటర్లకు ఓటు వేసేందుకు డబ్బులు ఇచ్చారని, తమకు కూడా 1000 రూపాయలు ఇస్తేనే ఓటు వేస్తామంటూ పోలింగ్ కేంద్రం వద్ద భీష్మించుకొని కూర్చున్నారు. ఇది చూసిన నేతలు, స్థానిక ప్రజలు విస్తుపోయారు. ఆత్మకూరు మున్సిపాలిటీ17వ వార్డు పరిధిలోని జమ్మలపాలెం ప్రాంతంలో 36 గిరిజన కుటుంబాలకు చెందిన 120 మంది ఓటర్లు ఉన్నారు.
అయితే, తమ పక్క వార్డులో డబ్బులు పంచి తమకు మాత్రం డబ్బులు ఇవ్వకుండా ఓట్లు వేయమంటున్నారని, ఇదెక్కడి న్యాయం అని వారు ప్రశ్నించారు. అందరికీ ఒకే న్యాయం ఉండాలి కదా అని వాపోయారు. తమకు ఏ రాజకీయ పార్టీ నాయకులు కూడా ఓట్లకు డబ్బులు ఇవ్వలేదని, డబ్బులు ఇస్తేనే ఓట్లు వేస్తామని తేల్చి చెప్పారు. చివరకి వారంతా ఓట్లు వేయకుండానే ఇళ్ల వద్ద కూర్చుని నిరసన తెలియజేస్తున్నారు. అయితు, ఓటుకు నోటు ఇవ్వకుండా తమకు అన్యాయం చేశారంటూ అమాయకంగా వీరు మాట్లాడుతున్న తీరు చూసి అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఓటింగ్ ప్రక్రియ పై ఎన్ని అవగాహనా సదస్సులు నిర్వహించిన కూడా ఇటువంటి వారిలో మార్పు రాకపోవడం నిజంగా అతియోశక్తి అనే చెప్పాలి.
Also read:
Russia: సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్‌పై రష్యా ఆంక్షలు.. మాట వినకపోతే.. బ్లాక్ చేస్తామంటూ హెచ్చరిక