Andhra Pradesh: ఒక్క ఫొటోతో మొదలైన నా జీవితం.. అంచెలంచెలుగా ఎదిగింది.. మంత్రి రోజా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఫొటోలు (Photos).. కాలం మారినా వీటికి ఉన్న క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. చిన్నా పెద్దా, యువత అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి జ్ఞాపకాలను పదిలం చేసుకోవడానికి ఫొటోలు ఎంతో తోడ్పడతాయి. మాటల్లో చెప్పలేని భావాలను ఫొటోల ద్వారా సునాయాసంగా..

Andhra Pradesh: ఒక్క ఫొటోతో మొదలైన నా జీవితం.. అంచెలంచెలుగా ఎదిగింది.. మంత్రి రోజా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Minister Roja
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jul 30, 2022 | 4:29 PM

ఫొటోలు (Photos).. కాలం మారినా వీటికి ఉన్న క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. చిన్నా పెద్దా, యువత అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి జ్ఞాపకాలను పదిలం చేసుకోవడానికి ఫొటోలు ఎంతో తోడ్పడతాయి. మాటల్లో చెప్పలేని భావాలను ఫొటోల ద్వారా సునాయాసంగా చెప్పవచ్చు. అందుకే ఫొటోలు, కెమెరాలలో చాలా మార్పులు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ వాడే సెల్ ఫోన్లలో కెమెరా ముఖ్యమైన ఫీచర్ గా మారిపోయింది. మనకు నచ్చిన దృశ్యాలను (Video) ఫోన్ కెమెరా ద్వారా వెంటనే క్లిక్ మనిపించేస్తున్నాం. వాటిని భద్రంగా దాచుకుంటున్నాం. అందుకే ఫొటోల గొప్పదనాన్ని తెలియజేయం జకోసం విజయవాడ లో ఫొటోగ్రఫీ కార్నివాల్ ఏర్పాటు చేశారు. ఎస్ ఎస్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆర్కే.రోజా పాల్గొన్నారు. లేటెస్ట్ కెమెరాలతో ఫొటోలు తీసి, ఫొటోగ్రాఫర్లలో జోష్ నింపారు. ఒక ఫొటో తో తన జీవితం మొదలైందన్న రోజా.. తన జీవితాన్ని అంచెలంచెలుగా ఎదిగేలా చేసిందని వ్యాఖ్యానించారు. ఓక వేదికపైకి అన్ని ఫొటోగ్రఫీ సంస్థలు రావడం ఆనందంగా ఉంద్న్నారు.

మెట్రో పాలిటన్ సిటీలకు పరిమితమైన ఫొటోగ్రఫీ ఎక్స్ పో లు ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయడం అనందంగా ఉందని మంత్రి రోజా వెల్లడించారు. ఒకే క్లిక్ తో 3 వేల మంది ఫొటో గ్రాఫర్స్ ఫొటో తియ్యడం గొప్ప అనుభూతి అనుభూతి కలిగించిందని సంతోషం వ్యక్తం చేశారు. కళ్లకు కట్టినట్లు సృజనాత్మకతను వెలికితీయడంలో ఫొటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్స్ ది కీలక పాత్ర ఉందని కొనియాడారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తలు చదవండి..