Pawan – YCP : పవన్‌ కళ్యాణ్‌పై మంత్రి పేర్ని నాని ఫైర్.. ట్విట్టర్ వేదికగా సంచలన కామెంట్స్..

|

Sep 28, 2021 | 7:11 AM

Pawan - YCP : జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ ఏపీ ప్రభుత్వం, మంత్రులపై చేసిన కామెంట్స్ పెను దుమారం రేపుతున్నాయి. పవన్ వ్యాఖ్యలపై మంత్రులు సీరియస్‌గా..

Pawan - YCP : పవన్‌ కళ్యాణ్‌పై మంత్రి పేర్ని నాని ఫైర్.. ట్విట్టర్ వేదికగా సంచలన కామెంట్స్..
Perni Nani
Follow us on

Pawan – YCP : జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ ఏపీ ప్రభుత్వం, మంత్రులపై చేసిన కామెంట్స్ పెను దుమారం రేపుతున్నాయి. పవన్ వ్యాఖ్యలపై మంత్రులు సీరియస్‌గా రియాక్ట్ అవుతున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు ధీటైన కౌంటర్ ఇస్తూ.. ఆయన విధానాలను తూర్పారబడుతున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి పేర్ని నాని ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. ఇదే అంశంపై మీడియాతో మాట్లాడిన ఆయన.. పవన్‌కు ఒళ్లంతా లేక్కలేని తిక్క ఉందంటూ తీవ్రపదజాలంతో విరుచుకుపడ్డారు. దోపిడీ చేస్తున్నావు కాబట్టే.. మా ప్రభుత్వం నీకు సింహస్వప్నంగా కనిపిస్తోందంటూ మంత్రి నాని ఫైర్ అయ్యారు. మేం సన్నాసులం అయితే.. పవన్ కళ్యాణ్ సన్నాసిన్నర సన్నాసి అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 800 థియేటర్లు ఓపెన్ అయితే పవన్ కళ్యాణ్‌కు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. మా ఎన్నికల్లో లబ్ధి కోసమే.. సినిమా ఫంక్షన్‌ను రాజకీయాలకు వేదికగా మార్చేశారని విమర్శించారు. ఈ పిచ్చి మాటలు నీతో మాట్లాడిస్తోంది ఎవరు? అంటూ ఫైర్ అయ్యారు. పవన్ తన విష ప్రచారం మానుకోవాలని హితవుచెప్పారు.

ఇదిలాఉంటే.. ట్విట్టర్ వేదికగానూ పవన్ కళ్యాణ్‌పై ఫైర్ అయ్యారు మంత్రి పేర్ని నాని. పవన్ బ్రతుకేంటో జనాలందరికీ తెలుసునని మీడియా ముందు వ్యాఖ్యానించిన ఆయన.. ట్విట్టర్‌‌లో సీరియస్ కామెంట్స్ చేశారు. ‘‘జనం ఛీత్కారాలు.. ఓటర్ల తిరస్కారాలు.. తమరి వైవాహిక సంస్కారాలు.. వరాహ సమానులకు న‘మస్కా’రాలు..’’ అంటూ పవన్‌ను జనాలు నమ్మడం లేదని ఉద్దేశ్యంతో ఆయన ఈ కామెంట్స్ చేశారు. పవన్ తీరు మార్చుకోవాలని హితవుచెప్పారు. ఏపీ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి జగన్‌పై అవాకులు, చవాకులు పేల్చడం మానేయాలని పవన్ కళ్యాణ్‌కు మంత్రి పేర్ని నాని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

Also read:

Horoscope Today: ఏ రాశివారు స్త్రీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.. ఈరోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

HPCL Recruitment: హెచ్‌పీసీఎల్‌ బయోఫ్యూయల్స్‌లో ఉద్యోగాలు.. అర్హులు ఎవరు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?

Vitamin D Deficiency: మీలో విటమిన్ డి లోపం ఉంటే మీ నాలుక గుర్తిస్తుంది.. ఎలానో తెలుసా..