AP Govt: అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన మంత్రి కన్నబాబు.. వారందరికీ ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయంటూ..

|

Jul 15, 2021 | 5:37 PM

AP Govt: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రిజర్వేషన్ల అంశంపై మంత్రి కన్నబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లపై రాష్ట్ర..

AP Govt: అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన మంత్రి కన్నబాబు.. వారందరికీ ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయంటూ..
Minister Kanna Babu
Follow us on

AP Govt: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రిజర్వేషన్ల అంశంపై మంత్రి కన్నబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంటుందన్నారు. అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు విద్యా, ఉద్యోగాల్లో అమలు చేసేందుకు ఉత్తర్వుల జారీ చేశామని మంత్రి తెలిపారు. ఎక్కడా గందరగోళానికి తావు లేకుండా ఈ రిజర్వేషన్ల అమలుకు నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. రిజర్వేషన్లు లేని అన్ని సామాజిక వర్గాలకూ ఇవి వర్తిస్తాయని చెప్పారు. ఇదే అంశంపై గురువారం నాడు మీడియాతో మాట్లాడిన మంత్రి కన్నబాబు.. రూ. 8 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉంటే.. వారికి జిర్వేషన్లు వర్తింప జేసేలా జీవో విడుదల చేశామన్నారు.

గతంలో చంద్రబాబు ప్రభుత్వం కాపులకు బీసీ ఎఫ్ పేరిట 5 శాతం రిజర్వేషన్లు కల్పించి గందరగోళం సృష్టించారని ఆరోపించారు. ఫలితంగా కోర్టుల్లో కేసులు వేసి దాన్ని నిలిపివేశారని అన్నారు. కాపుల రిజర్వేషన్లపై కేంద్రానికి ఓ లేఖ రాసి వారిపైకి నెట్టేశారని నాటి చంద్రబాబు ప్రభుత్వం తీరుపై మంత్రి కన్నబాబు విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ప్రభుత్వం తీరుతో కాపులను బీసీలుగా పరిగణించాలో, అగ్రవర్ణాలుగా పరిగణినంచాలో తెలియని పరిస్థితి సృష్టించారని విమర్శించారు. కానీ, తాము ఇలాంటి గందరగోళానికి తావు లేకుండా అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని మంత్రి కన్నబాబు తెలిపారు. కాపులు, బ్రాహ్మణులు, రెడ్డి, రాజులు ఇలా ఎవరైనా రూ. 8 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉంటే వారికి ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయని మంత్రి కన్నబాబు క్లారిటీ ఇచ్చారు. ఆ మేరకు కుల ధ్రువపత్రాలు స్థానిక తహశీల్దార్‌లే జారీ చేసేలా ఆదేశాలు ఇచ్చామని మంత్రి చెప్పారు. విద్యా ఉద్యోగాల్లో అందరికి సమాన హక్కులు కలగాలన్న లక్ష్యంతోనే ఈ రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. కేంద్రం సూచించిన 5 ఎకరాల భూమి, 100 గజాల నివాస స్థలం లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకోలేదన్నారు.

ఇదే సమయంలో టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజకీయ విధానాలపై మంత్రి కన్నబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబు జత కట్టని, మింగుడు పడని పార్టీ వైసిపి ఒక్కటే అని మంత్రి కన్నబాబు వ్యాఖ్యానించారు. దేశంలోని అన్ని పార్టీలతోనూ ఆయన పొత్తులు పెట్టుకున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ సహా అందరి తోనూ టీడీపీ పొత్తులు పెట్టుకుంది అన్నారు. ఇప్పుడు తిడుతున్న కేసీఆర్ తోనూ కలిసి ఎన్నికలకు వెళ్లారని మంత్రి గుర్తుచేశారు. మోడీతో చేతులు కలిపి చివరికి తిట్టి బీజేపీ నుంచి బయటకు వచ్చారని అన్నారు. పోలవరం నిర్వాసితులకు న్యాయం చేసి.. ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తామని మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు.

Also read:

Telangana TDP: తెలంగాణ టీడీపీ అధ్యక్షుడి ఎంపికలో చంద్రబాబు నయా స్ట్రాటజీ!.. పూర్వ వైభవం దక్కేనా?..

Hyderabad City: హైదరాబాద్‌లో రెచ్చిపోయిన కేటుగాళ్లు.. నకిలీపత్రాలతో రూ. 1.39 కోట్ల మోసం.. షాక్ అయిన బ్యాంక్ మేనేజర్..

Hyderabad Rains: పేరుకే ‘భాగ్యనగరం’.. చిన్నపాటి వర్షం పడిందో ‘బాధల నగరమే’.. ఈ సమస్యలకు కారణాలేంటంటే..