Andhra Pradesh: “పాదయాత్ర పేరుతో దండయాత్ర.. అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు పెడతాం”.. మంత్రి అమర్నాథ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

|

Sep 09, 2022 | 3:20 PM

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై (Chandrababu Naidu) మంత్రి గుడివాడ అమర్నాథ్ మరోసారి ఫైర్ అయ్యారు. అమరావతికి ఆయన చేసింది ఏమీ లేదని అన్నారు. అమరావతి కోసం గుంటూరు, విజయవాడకు...

Andhra Pradesh: పాదయాత్ర పేరుతో దండయాత్ర.. అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు పెడతాం.. మంత్రి అమర్నాథ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Gudivada Amarnath
Follow us on

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై (Chandrababu Naidu) మంత్రి గుడివాడ అమర్నాథ్ మరోసారి ఫైర్ అయ్యారు. అమరావతికి ఆయన చేసింది ఏమీ లేదని అన్నారు. అమరావతి కోసం గుంటూరు, విజయవాడకు అన్యాయం చేశారని మండిపడ్డారు. స్వంత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని మోసం చేశారని, 29 గ్రామాల కోసమే ఉద్యమం చేస్తున్నారని ఆరోపించారు. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో సీఎం జగన్ మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారని చెప్పారు. అమరాతి రైతులు చేస్తున్న పాదయాత్ర విశాఖపై దండయాత్రగా అభివర్ణించారు. పాదయాత్రను ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్నటికీ అంగీకరించరని క్లారిటీ ఇచ్చారు. పాదయాత్రతో (Padayatra)Andhra Pradesh శాంతి భద్రతలకు విఘాతం కలిగితే అందుకు చంద్రబాబే బాధ్యత వహించాలని మండిపడ్డారు. పాదయాత్ర పేరుతో దండయాత్ర చేస్తే జనం చూస్తూ ఊరుకోరని వార్నింగ్ ఇచ్చారు.

అసెంబ్లీలో మూడు రాజధానులపై బిల్లు పెడతాం. మూడు రాజధానులు చేసి తీరుతామని మంత్రి అమర్నాథ్ మరోసారి స్పష్టం చేశారు.
గతంలోను మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇలాంటి ఆసక్తికర వ్యాఖ్యలే చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాష్ట్రానికి ప్రాజెక్టులు, పరిశ్రమలను తీసుకొస్తుంటే టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫార్మా రంగానికి రాష్ట్రం హబ్‌గా మారబోతోందని మంత్రి చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న వారిని రాష్ట్రం నుంచి వెళ్లగొట్టాలని మండిపడ్డారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును, ఆయన కుమారుడు లోకేశ్‌ను జైలుకు పంపాలని డిమాండ్ చేశారు.

మూడు రాజధానుల నిర్ణయానికి వంద శాతం కట్టుబడి ఉన్నామని మంత్రి బొత్స సత్యనారాయణ కూడా గతంలో ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. రాజధానిని నిర్ణయించుకునే అధికారం రాష్ట్రానికే ఉందని, సీఆర్‌డీఏ చట్టం అమలుకు తాము వ్యతిరేకం కాదని చెప్పారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లు పెడతామో లేదో మీరే చూస్తారని ఘాటుగా అన్నారు. కాగా.. రాజధాని అమరావతిపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 6 నెలల్లో అమరావతిని అభివృద్ధి చేయాలని ఆదేశించింది. రాజధానిపై చట్టాలు చేసే అధికారం శాసనసభకు లేదని అలాంటప్పుడు సీఆర్డీఏ చట్టం రద్దు చేయడం కుదరదని చెప్పింది. అంతేకాకుండా అమరావతి నుంచి ఏ కార్యాలయాన్నీ తరలించడానికి వీల్లేదని స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..