Andhra Pradesh: ఈనెల 25న కర్నూల్‌ జిల్లాలో మెగా జాబ్ మేళా.. పూర్తి వివరాలివే

జిల్లాలోని నిరుద్యోగ యువతకు సదావకాశం. ఈనెల 25న నంద్యాల జిల్లాలో మెగా జాబ్ మేళా జరగనుంది. బేతంచెర్లలో నిరుద్యోగ యువతీ యువకులకు ఏపీ వృత్తి నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ మేళా..

Andhra Pradesh: ఈనెల 25న కర్నూల్‌ జిల్లాలో మెగా జాబ్ మేళా.. పూర్తి వివరాలివే
Mega Job Mela

Edited By: Srilakshmi C

Updated on: Jul 20, 2023 | 8:48 AM

కర్నూలు, జులై 20: జిల్లాలోని నిరుద్యోగ యువతకు సదావకాశం. ఈనెల 25న నంద్యాల జిల్లాలో మెగా జాబ్ మేళా జరగనుంది. బేతంచెర్లలో నిరుద్యోగ యువతీ యువకులకు ఏపీ వృత్తి నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ మేళా జరగనుంది. ఈ ఇంటర్వ్యూలు ఉదయం 9.30 గంటల నుంచి శేషారెడ్డి ఉన్నత పాఠశాలలో జరుగుతాయని ఆ సంస్థ అధికారి ప్రతాపరెడ్డి తెలిపారు.

వైయస్ కే, ఇన్ఫోటెక్, బజాజ్, డిక్సన్, మ్యాన్యుఫాక్చరింగ్ కంపెనీలలో పని చేయడానికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఐటిఐ డిప్లొమా ఇంటర్ డిగ్రీ బీటెక్ ఎంబీఏ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఇంటర్వ్యూలకు అర్హులు. పూర్తి వివరాలకు 944022 4291 నెంబర్‌కు కాల్ చేయవచ్చనీ ప్రతాప్ రెడ్డి తెలిపారు..

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.