AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: సీఎం జగన్‌పై జనసేనాని విమర్శనాస్త్రాలు.. సీబీఐ దత్తపుత్రుడు అనాల్సి వస్తుందంటూ..

Koulu Rythu Bharosa Yatra: రాష్ట్రంలోని కౌలు రైతుల కుటుంబాలను ఆదుకోవడమే లక్ష్యంగా 'కౌలు రైతుల భరోసా యాత్ర'ను జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టారు. ఇటీవలే ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను కలిసి పరామర్శించి.. వారికి ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నారు.

Pawan Kalyan: సీఎం జగన్‌పై జనసేనాని విమర్శనాస్త్రాలు..  సీబీఐ దత్తపుత్రుడు అనాల్సి వస్తుందంటూ..
Pawan Kalyan
Basha Shek
|

Updated on: Apr 12, 2022 | 4:52 PM

Share

Koulu Rythu Bharosa Yatra: రాష్ట్రంలోని కౌలు రైతుల కుటుంబాలను ఆదుకోవడమే లక్ష్యంగా ‘కౌలు రైతుల భరోసా యాత్ర’ను జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టారు. ఇటీవలే ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను కలిసి పరామర్శించి.. వారికి ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నారు. కాగా ముందుగా ఈ యాత్రను శ్రీ సత్య సాయి జిల్లాలోని కొత్త చెరువు నుంచి పవన్ నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆత్యహత్య చేసుకున్న అన్నదాతల కుటుంబాలను ఆత్మీయంగా పలకరించారు జన సేనాని. వారి కుటుంబ పరిస్థితులు, బిడ్డల చదువుల గురించి ఆరా తీశారు. ఆర్ధిక ఇబ్బందులు నేపథ్యంలో వారి చదువులకు ఎటువంటి ఆంటకం ఏర్పడకుండా జనసేన పార్టీ బాధ్యత తీసుకుంటుందని పవన్‌ హామీ ఇచ్చారు. కాగా ఇటీవల కొత్త జిల్లాల ఏర్పాటు కార్యక్రమంలో ప్రసంగించిన ముఖ్యమంత్రి జగన్‌ పవన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. పవన్‌ను చంద్రబాబు దత్తపుత్రుడంటూ వ్యాఖ్యానించారు. సీఎంతో పాటు గత కొద్ది రోజులుగా వైసీపీ నాయకులు కూడా జనసేనానిపై విరుచుకుపడుతున్నారు.

తాజాగా ఈ విమర్శలపై స్పందించిన పవన్‌.. ముఖ్యమంత్రి జగన్‌, వైసీపీ నాయకులకు కౌంటర్లు ఇచ్చారు. ‘నేను ఎవరిపై వ్యక్తిగత విమర్శలు చేయను. ప్రభుత్వ పాలసీలపైనే మాట్లాడుతాను. కానీ ఇటీవల కొందరు వైసీపీ నేతలు నన్ను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు. ఇలాంటి విమర్శలను సహించేది లేదు. నన్ను సీబీఎన్‌ దత్త పుత్రుడంటే వాళ్ల నాయకుడు (జగన్‌)ని సీబీఐ దత్తపుత్రుడు అనాల్సి వస్తుంది. మా పార్టీని టీడీపీ- బీ టీమ్‌ అంటే వారిని చర్లపల్లి జైలు షటిల్‌ టీమ్‌ అనాల్సి వస్తుంది. వైసీపీ నాయకుల్లో చాలామంది సీబీఐ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. వారు ఆర్థికనేరాలు చేసి జైల్లో కూర్చున్నవాళ్లు. నీతులు చెప్పే హక్కు, స్థాయి వారికి లేదు. మేము కౌలు రైతుల ఆత్మహత్యలపై స్పందించిన తర్వాత ప్రభుత్వం వారికి ఏడు లక్షల రూపాయల పరిహారం ఇచ్చింది.  ఇదేదో ముందే చేసి ఉంటే అందరికీ సంతోషంగా ఉండేది. ఇందులో కూడా కొందరిని అర్హత లేదని విస్మరిస్తున్నారు. ప్రతి రైతుకు పరిహారం అందే వరకు జనసేన పార్టీ పోరాడుతుంది. మేము రైతుల కోసం యాత్రలు చేస్తుంటే.. వైసీపీ నాయకులు దానికి మైలేజ్ వస్తుందన్న కారణంతో నీచ రాజకీయాలు చేస్తున్నారు’ అని విమర్శించారు జనసేనాని.

Also Read: Stock Market: వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు.. సెన్సెక్స్ 388, నిఫ్టీ 145 పాయింట్లు డౌన్..

Telangana: ఆలయ ప్రహరీ పునాది తవ్వుతుండగా బయటపడ్డ పెట్టె.. ఓపెన్ చేసి చూడగా కళ్లు జిగేల్…

Pak New PM: ఆయనొచ్చాడు.. మైకులు బద్దలవుతాయి.. పాకిస్తాన్‌లో నవ్వులు పూయిస్తున్న పంచ్ డైలాగ్..