
ప్రజలకు మెరుగైన సర్వీస్ ఇవ్వాలి. త్వరితగతిన పని అయితే.. ఆ సాయాన్ని వారు ఎప్పటికీ మర్చిపోరు. సీఎం జగన్ నేతలకు, అధికారులకు ఎప్పుడూ చెప్పే మాట ఇదే. కుల, మత, పార్టీలకు వ్యతిరేకంగా అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందాలని ఆయన ఆశపడుతూ ఉంటారు. అందుకు భిన్నంగా జరిగితే.. ఎంత పెద్ద లీడర్లకైనా, టాప్ క్లాస్ అఫీషియల్స్‌కు ఐనా తలంటేస్తారు. తాజాగా జగన్ మరో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జగనన్న సురక్షలో భాగంలో.. జూలై ఫస్ట్ నుంచి విలేజ్, వార్డ్ సచివాలయాల వద్ద స్పెషల్ క్యాంప్స్ 4 వారాల పాటు కండెక్ట్ చేయనున్నారు. అక్కడ వివిధ రకాల ధ్రువీకరణ పత్రాలతో పాటు 11 రకాల సర్వీసులు ఎటువంటి రుసుము లేకుండా ఉచితంగా అందించనున్నారు.
చాలా కాలంగా మొండికి పడిన పనులకు ఇక్కడ చెక్ పెట్టనున్నారు. ఏవైనా పర్సనల్ డాక్యూమెంట్స్‌కు సంబంధించి ఇబ్బందులు ఉన్నా.. సంక్షేమ పథకాల అందడంలో జాప్యం జరుగుతున్నా.. అలాంటి సమస్యలకు ఇక్కడ సొల్యూషన్ లభిస్తుంది. ఈ స్పెషల్ క్యాంపుల కోసం అధికారులు ఇప్పటికే కసరత్తు మొదలెట్టారు. MPDO, తహసీల్దార్‌ల ఆధ్వర్యంలో 2 స్పెషల్ టీమ్స్.. ఈ క్యాంపుల నిర్వహణ బాధ్యతను చూసుకుంటాయి. అవసరం అనిపిస్తే 3వ టీమ్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక పనుల తీరును పర్వవేక్షించేందకు ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌కు ఒక ప్రత్యేక అధికారి అందుబాటులో ఉంటారు. సచివాలయం పరిధిలో ఏ రోజు క్యాంపు నిర్వహిస్తున్నారో ముందుగా అందరికీ తెలిసేలా ప్రచారం చేస్తున్నారు.
ఈ క్యాంపుల్లో పాల్గొనే వాలంటీర్లకు, సిబ్బందికి ప్రజంట్ ట్రైనింగ్ ఇస్తున్నారు. మీ సమస్యలు చిట్టాని రెడీ చేసి.. జూన్ 1వ తేదిన సచివాలయాలకు వెళ్లేందుకు రెడీ అవ్వండి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.