ఏపీ ఐసెట్-2023 ప్రవేశ పరీక్ష ఫలితాలు బుధవారం (జూన్ 15) విడుదలయ్యాయి. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డి విడుదల చేశారు. ఐసెట్ పరీక్షకు హాజరైన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్ లో ద్వారా రిజల్ట్స్ చేసుకోవచ్చు. విద్యార్ధులు రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్‌టికెట్ నెంబరు లేదా రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ఐసెట్ ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మే 24వ తేదీన ఐసెట్ ప్రవేవ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఐసెట్ ప్రవేశ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 49,162 మంది దరఖాస్తుకోగా, వారిలో దాదాపు 44 వేల మంది హాజరయ్యారు.
తాజాగా విడుదలైన ఐసెట్ ఫలితాల్లో రేణిగుంటకు చెందిన తపల జగదీశ్‌కుమార్‌రెడ్డి ఫస్ట్ ర్యాంకులో నిలిచాడు. సికింద్రాబాద్‌కు చెందిన వేదాంతం సాయివెంకట కార్తీక్ సెకండ్ ర్యాంక్, అనంతపురంకు చెందిన పుట్లూరు రోహిత్ థార్డ్ ర్యాంక్‌లో నిలిచారు. ఐసెట్-2023లో విద్యార్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా 2023-24 విద్యా సంవత్సరానికి గానూ ఏపీలోని యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తామని ఈ సందర్భంగా ప్రొఫెసర్ రామక్షష్ణా రెడ్డి వివరించారు. కౌన్సెలింగ్ కు ప్రక్రియ త్వరలో ప్రారంభమవుతుందన్నారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.