Narasaraopet: దారుణం! సహనం కోల్పోయి భార్యను సుత్తితో కొట్టి హతమార్చిన భర్త

|

Oct 12, 2022 | 9:33 PM

భార్యభర్తలు వాదులాడుకుంటూ క్షణికావేశంలో భార్యను అంతమొందించాడు భర్త. అనంతరం భయాందోళనలకు గురైన భర్త పురుగుల మందుతాగి ఆత్మయత్యాయత్నం చేశాడు. నరసరావుపేటలో బుధవారం చోటుచేసుకున్న ఈ..

Narasaraopet: దారుణం! సహనం కోల్పోయి భార్యను సుత్తితో కొట్టి హతమార్చిన భర్త
Husband Killed Wife
Follow us on

భార్యభర్తలు వాదులాడుకుంటూ క్షణికావేశంలో భార్యను అంతమొందించాడు భర్త. అనంతరం భయాందోళనలకు గురైన భర్త పురుగుల మందుతాగి ఆత్మయత్యాయత్నం చేశాడు. నరసరావుపేటలో బుధవారం చోటుచేసుకున్న ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా పరిధిలోని గురువాయపాలెంలో కాపురముంటున్న తమ్మిశెట్టి వెంకటరావు, పద్మ దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. బుధవారం (అక్టోబర్‌ 12) ఉదయం కూలి పని నిమిత్తం నరసరావుపేట రైల్వే స్టేషన్‌ సమీపంలోని లోకల్ మార్కెట్‌ జంక్షన్‌కు చేరుకున్న దంపతులకు ఏదో విషయమై వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో మాటామాటా పెరిగింది. దీంతో సహనం కోల్పోయిన వెంకటరావు క్షణికావేశంలో భార్య పద్మ తలపై సుత్తితో బలంగా మోదాడు. ఈ ఘటనలో పద్మ అక్కడికక్కడే మృతి చెందింది. భార్య మృతితో భయాందోళనలకు గురైన వెంకటరావు వెంటనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఇవి కూడా చదవండి

అపస్మారక స్థితిలో పడిపోయిన వెంకటరావును స్థానికులు గమనించి సమీపంలోని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, రైల్వే ట్రాక్‌ పక్కన పడిఉన్న పద్మ మృతదేహాన్ని స్వాదీనం చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.
.