Andhra Pradesh: రోడ్లపై సభలకు ఓకే.. జీవో నెంబర్‌ 1ని కొట్టివేసిన ఆంధ్రప్రదేశ్‌ హైకోర్ట్‌.

|

May 12, 2023 | 12:10 PM

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్ట్‌ కీలక ఆదేశాలు జారీ చేసింది. జీవో నెంబర్‌ 1ని కొట్టివేసింది. చంద్రబాబు పర్యటనలో భాగంగా జరిగిన తొక్కిసలాట జరిగి పలువురు మరణించిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపై, కూడళ్లలో సభలు నిర్వహించకూడదని జీవో నెంబర్‌ 1ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే...

Andhra Pradesh: రోడ్లపై సభలకు ఓకే.. జీవో నెంబర్‌ 1ని కొట్టివేసిన ఆంధ్రప్రదేశ్‌ హైకోర్ట్‌.
Ap High Court
Follow us on

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్ట్‌ కీలక ఆదేశాలు జారీ చేసింది. జీవో నెంబర్‌ 1ని కొట్టివేసింది. చంద్రబాబు పర్యటనలో భాగంగా జరిగిన తొక్కిసలాట జరిగి పలువురు మరణించిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపై, కూడళ్లలో సభలు నిర్వహించకూడదని జీవో నెంబర్‌ 1ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ జీవో ప్రకారం రాజకీయ పార్టీలు రోడ్లపై సభలు నిర్వహించకూడదనే నిబంధన విధించారు.

అయితే జీవో నెంబర్‌ 1కి వ్యతిరేకంగా విపక్షాలు హైకోర్టుల ఆశ్రయించాయి. జీవోను సవాల్‌ చేస్తూ విపక్షాలు పిటిషన్‌ దాఖలు చేశాయి. దీనిపై తాజాగా విచారణ జరిపిర హైకోర్ట్‌ జీవో నెంబర్‌ 1ని కొట్టివేసింది. జీవో 1ను సస్పెండ్‌ చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఇదిలా ఉంటే ఈ జోవోను రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 2వ తేదీన తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ జీవోను సవాల్‌ చేస్తూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హైకోర్టులో పిల్‌ వేశారు. ఇదే జీవోను సవాలు చేస్తూ పలువురు టీడీపీ నాయకులు సైతం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ప్రతిపక్ష నాయకులు నిర్వహించే కార్యక్రమాలను జీవో నంబర్‌ 1 పేరుతో అడ్డుకునే ప్రమాదం ఉందని.. జీవోను రద్దు చేయాలని కోరారు. పిటిషన్లపై జనవరి 24న విచారణ ప్రారంభించిన ధర్మాసంన తీర్పును రిజర్వు చేసింది. తాజాగా ఆ జీవోను కొట్టేస్తూ తీర్పు వెలువరించింది.

ఇవి కూడా చదవండి

హర్షం వ్యక్తం చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు..

జీవో నెంబర్‌ 1ని కొట్టివేడయంపై ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు హర్షం వ్యక్తం చేశారు. న్యాయస్థానం న్యాయమే చేసిందని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యల పట్ల నినదించే హక్కు ప్రతిపక్షాలకు ఉంటుందని సోము.. ప్రభుత్వ ఆంక్షలు ఫలితంగా ప్రజా ఉద్యమాలు నిర్వీర్యం అవుతున్న తరుణంలో, కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. జీవోల పేరుతో ప్రాధమిక హక్కులు కాలరాయాలని వైసీపీ ప్రభుత్వం కలగనడం ఇకనైనా మానాలని సోము వీర్రాజు అన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..