R5 Zone: అమరావతి రైతులకు చుక్కెదురు.. పిటిషన్లను కొట్టేసిన ఏపీ హైకోర్టు..

|

May 05, 2023 | 4:00 PM

R5 Zone: ఆర్5 జోన్ అంశంలో రైతులకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి చెందిన పేద రైతులకైనా అమరావతిలో భూములు ఇవ్వాలనే ఏపీ ప్రభుత్వం ‘ఆర్ 5 జోన్’ నిర్ణయానికి వ్యతిరేకంగా రైతులు వేసిన పిటీషన్లను..

R5 Zone: అమరావతి రైతులకు చుక్కెదురు.. పిటిషన్లను కొట్టేసిన ఏపీ హైకోర్టు..
AP High Court Over Farmers R5 Zone Issue
Follow us on

R5 Zone: ఆర్5 జోన్ అంశంలో రైతులకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి చెందిన పేద రైతులకైనా అమరావతిలో భూములు ఇవ్వాలనే ఏపీ ప్రభుత్వం ‘ఆర్ 5 జోన్’ నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి రైతులు వేసిన పిటీషన్లను రాష్ట్ర హైకోర్టు కొట్టేసింది. వారు దాఖలు చేసిన పిటిషన్లను శుక్రవారం కోర్టు తిరస్కరించడంతో పాటు ఇళ్ల పట్టాలకు సంబంధించి న్యాయస్థాన తీర్పుకు లోబడి ఉండాలని సూచించింది.

కాగా, అమరావతిలోని ఆర్-5 జోన్‌ కోసం గుంటూరు జిల్లాలోని 550.65 ఎకరాలు, ఎన్టీఆర్ జిల్లా నుంచి 583.93 ఎకరాల భూమిని కలెక్టర్లకు బదలాయించేందుకు సీఆర్డీయే కమిషనర్‌కి అనుమతిస్తూ జీవో నెం.45ను వైయస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ క్రమంలో ఒక్కో కుటుంబానికి సెంటు స్థలం ఇవ్వాలని ప్రభుత్వం ఈ జీవో ద్వారా ప్రకటించింది. 10 లేఅవుట్లలో 45 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనేది ప్రభుత్వ నిర్ణయం. అయితే జీవో నెం. 45  అమలు చేయకుండా అదేశాలు ఇవ్వాలని అమరావతి రైతులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయమై ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు ఈ పిటిషన్‌ను తిరస్కరించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం  క్లిక్ చేయండి..