Andhra Pradesh: ఇదే ఏపీ నూతన మంత్రుల ఫైనల్ లిస్ట్.. 25 మందితో కొత్త కేబినెట్..
ఆంధ్రప్రదేశ్ కొత్త కేబినెట్ ఖరారైంది. 25 మందితో కొత్త మంత్రివర్గ జాబితా విడుదలైంది. కేబినెట్ కూర్పులో ముఖ్యమంత్రి సీఎం జగన్ అన్ని అంశాలను బేరీజు వేసుకున్నారు.
జగన్ టీం 24లో ఎవరు ఉండబోతున్నారనే దానిపై.. క్లారిటీ వచ్చేసింది. గత మూడు రోజులుగా ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పలు దఫాలుగా చర్చించిన సీఎం.. ఈరోజు కూడా సమావేశమయ్యారు. ఫైనల్‌గా కేబినెట్ కూర్పుపై సీఎం కసరత్తు పూర్తయింది. సామాజిక సమీకరణాలు, ప్రాంతాల మేరకు కొత్త మంత్రివర్గం కూర్పు జరిగింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారీటి వర్గాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.
మంత్రుల ఫైనల్ లిస్ట్ ————-
- సీదిరి అప్పలరాజు(పలాస)
- ధర్మాన ప్రసాదరావు(శ్రీకాకుళం)
- బొత్స సత్యనారాయణ(చీపురుపల్లి)
- పి.రాజన్న దొర(సాలూరు)
- గుడివాడ అమర్నాథ్(అనకాపల్లి)
- బూడి ముత్యాలనాయుడు(మాడుగుల)
- దాడిశెట్టి రాజా(తుని)
- పినిపే విశ్వరూప్(అమలాపురం)
- చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ(రామచంద్రాపురం)
- తానేటి వనతి(కొవ్వూరు)
- కారుమూరి నాగేశ్వరరావు(తణుకు)
- కొట్టు సత్యనారాయణ(తాడేపల్లిగూడెం)
- జోగి రమేష్(పెడన)
- అంబటి రాంబాబు(సత్తెనపల్లి)
- అంజద్ భాషా(కడప)
- మేరుగు నాగార్జున(వేమూరు)
- విడదల రజనీ(చిలకలూరిపేట)
- కాకాణి గోవర్ధన్రెడ్డి(సర్వేపల్లి)
- పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(పుంగనూరు)
- ఆర్కె రోజా(నగరి)
- ఉషశ్రీ చరణ్(రాయదుర్గం)
- ఆదిమూలపు సురేశ్ (ఎర్రగొండపాలెం)
- నారాయణస్వామి(గంగాధర నెల్లూరు)
- గుమ్మనూరు జయరాం(ఆలూరు)
- బుగ్గన రాజేంద్రనాథ్(డోన్)
ప్రకాశం జిల్లా నుంచి ఆదిమూలపు సురేశ్‌కు చివరి నిమిషంలో మంత్రివర్గంలో స్థానం కల్పించారు. కొత్త మంత్రివర్గ జాబితా నుంచి తిప్పేస్వామిని తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. చివరి నిమిషంలో చేసిన మార్పులలో ఆదిమూలపు సురేశ్‌కు చోటు దక్కింది. తిప్పేస్వామికి బదులుగా ఆదిమూలపు సురేశ్‌కు ప్లేస్ కల్పించారు.