AP Crime: పేపర్ బాయ్స్ లా నటిస్తూ.. ఎవరూ లేని సమయంలో ఇళ్లల్లోకి దూరి.. తండ్రికుమారులు ఏం చేశారంటే
పగలు పేపర్ బాయ్స్ లా నటిస్తూ.. తలుపులు తెరిచి ఉన్న ఇళ్ల నుంచి సెల్ ఫోన్లు(Cell Phones) దొంగిలిస్తున్న తండ్రీకుమారులను పోలీసులు పట్టుకున్నారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా అసలు విషయాలు వెలుగులోకి...
పగలు పేపర్ బాయ్స్ లా నటిస్తూ.. తలుపులు తెరిచి ఉన్న ఇళ్ల నుంచి సెల్ ఫోన్లు(Cell Phones) దొంగిలిస్తున్న తండ్రీకుమారులను పోలీసులు పట్టుకున్నారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. తమిళనాడు(Tamila Nadu) రాష్ట్రానికి చెందిన తండ్రీకుమారులు మునియప్ప కుప్పన్, రాహుల్ రావేటి లు జీవనోపాధి కోసం తాడేపల్లి(Tadepallil) వచ్చారు. స్థానిక సాయిబాబా గుడి సమీపంలో టార్పాలిన్ పట్టాలతో వసతి ఏర్పాటు చేసుకొని అందులో ఉంటున్నారు. సులువుగా డబ్బులు సంపాదించేందుకు దొంగగా మారారు. ఉదయం న్యూస్ పేపర్లు వేసేవారిగా నటిస్తూ వీధుల్లో తిరిగేవారు. తలుపులు తెరిచి ఉన్న ఇళ్లలోకి ప్రవేశించి, సెల్ ఫోన్లు చోరీ చేసేవారు. విజయవాడ, మంగళగిరి బస్టాండ్లలో ప్రయాణికులు, సీతానగరం పుష్కర ఘాట్లలో యాత్రికుల సంచుల నుంచి సెల్ ఫోన్లు దొంగిలించేవారు. ఇలా గుంటూరు, విశాఖ జిల్లాల్లో 29 సెల్ ఫోన్లు, ఆరు ల్యాప్‌టాప్‌లు చోరీ చేశారు. ఈ క్రమంలో తండ్రీకుమారులిద్దరూ తాడేపల్లిలో అనుమానాస్పదంగా సంచరిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. తమదైన శైలిలో విచారించగా నిజాలు ఒప్పుకున్నారు. వారి నుంచి 16 ఫోన్లు, మూడు ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.9.14 లక్షలుంటుందని తెలిపారు.
Also Read
Electric Vehicles: ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న క్రేజ్.. అమ్మకాలలో ఈ కంపెనీ ఫస్ట్ ప్లేస్..!
ఓవైపు బెంగాలీ, మరోవైపు పుష్ప స్టెప్పులు.. అదరగొట్టిన డేవిడ్ వార్నర్..