Papi Kondalu: గోదావరి అలలపై పాపికొండల సౌందర్యం.. వెన్నెల రాత్రుల్లో ఇసుక తిన్నెల సోయగం
పాపికొండల వద్ద గోదావరి(Godavari) లో పడవ ప్రయాణం జీవితంలో మరపురాని మధురానుభూతి. తక్కువ వెడల్పులో రెండు కొండల మధ్య ప్రవహించే గోదావరి.. ఆ వాతావరణానికి మరింత సౌందర్యాన్ని తెచ్చి పెడుతుంది. భద్రాచలం(Bhadrachalam) నుంచి...
పాపికొండల వద్ద గోదావరి(Godavari) లో పడవ ప్రయాణం జీవితంలో మరపురాని మధురానుభూతి. తక్కువ వెడల్పులో రెండు కొండల మధ్య ప్రవహించే గోదావరి.. ఆ వాతావరణానికి మరింత సౌందర్యాన్ని తెచ్చి పెడుతుంది. భద్రాచలం(Bhadrachalam) నుంచి రాజమహేంద్రవరం వరకు చేసే లాంచీ ప్రయాణం పర్యటకులు మరచిపోలేని అనుభవం. గోదారమ్మ ఒడిలో, ప్రకృతి అందాలను వీక్షిస్తూ అలలపై సాగే బోటు ప్రయాణం మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. పాపికొండల పర్యటనకు నిర్వాహకులు సన్నద్ధమవుతున్నారు. పాపికొండలు విహారయాత్రకు(Tourism) ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. త్వరలో స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తే పాపికొండల సందర్శనకు వచ్చే వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. గోదావరిలో దేవీపట్నం మండలం కచ్చులూరు (మందం) వద్ద బోటు జరిగిన బోటు ప్రమాద ఘటన అనంతరం పాపికొండలకు వెళ్లే బోట్లకు ప్రభుత్వం కొత్త నిబంధనలు జారీ చేసింది. నిబంధనల ప్రకారం బోటు నిర్వాహకులు పర్యాటక బోట్లలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు పాటించిన బోట్లకే నదిలో ప్రయాణానికి అనుమతి లభించనుంది.
గత ప్రమాదాల నుంచి పాఠాలు నేర్చుకున్న అధికారులు, బోటు నిర్వాహకులు ఈసారి ప్రత్యేకమైన రక్షణ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి లాంచీలో రెండు ఇంజిన్లను అమర్చుతున్నారు. ప్రతి ఒక్కరికీ లైఫ్ జాకెట్ తప్పనిసరి చేయడంతో పాటు, ఒకేసారి ఐదారుగురిని రక్షించేలా గజ ఈతగాళ్లను, లైఫ్ బాయ్స్‌ను అందుబాటులో ఉంచారు. మొత్తానికి పర్యాటకుల ప్రాణాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ పాపికొండలు విహారయాత్రను పునఃప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
పాపికొండల వెనుక భాగానికి పశ్చిమగోదావరి జిల్లాలోని కొయ్యలగూడెం, కన్నాపురం, పోలవరం, శింగన్నపల్లి, వాడపల్లి, చీడూరు మీదుగా కొరుటూరుకు ఘాట్ రోడ్డు మార్గం ఉంది. పాపికొండల విహారయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలోని పట్టిసీమ ద్వీపం నుంచి మొదలవుతుంది. అక్కడి నుంచి పోలవరం, గొందూరు (పోచమ్మ గండి), సిరివాక, కొల్లూరు, పేరంటాలపల్లి మీదుగా సాగుతుంది. ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో పోలవరం వద్ద నిర్మిస్తున్న ఇందిరాసాగర్ ప్రాజెక్టు వల్ల ఘాట్ రోడ్డు మార్గం కనుమరుగయ్యే అవకాశం ఉంది.
Also Read
Solar Panels: కొత్త యుగం సోలార్ ప్యానెల్.. రాత్రిపూట కూడా విద్యుత్ ఉత్పత్తి..!
Sri Rama Navami: కన్నుల పండువగా భద్రాద్రి సీతారాముల కళ్యాణం.. పులకించిన భక్త జనం.. రేపు పట్టాభిషేకం