Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబుపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. చంద్రబాబు చేపట్టిన ‘సాధన దీక్ష’పై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. మంగళవారం నాడు అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు చేసే దీక్షలకు ఎంతటి హీనమైన చరిత్ర ఉందో అందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని అవినీతి మయం చేస్తూ నవ నిర్మాణ దీక్ష పేరుతో ఎంత దోచుకున్నారో కూడా తెలుసునని విమర్శించారు. అలాంటి దోపిడీ దారుడైన చంద్రబాబు ఇప్పుడొచ్చి.. దీక్షల పేరుతో రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కరోనా మొదటి దశను రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొందని గుర్తు చేసిన ఆయన.. రెండవ దశనూ అంతే స్థాయిలో సమర్థవంతంగా ఎదుర్కొన్నామని పేర్కొన్నారు. సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వల్లే రాష్ట్రంలో కరోనా మరణాలు అతి తక్కువ నమోదు అయ్యాయని పేర్కొన్నారు.
ఇంతకాలం హైదరాబాద్‌లో కూర్చొన్న చంద్రబాబు.. ఇప్పుడు వచ్చి దీక్షల పేరుతో సీఎం జగన్‌ను, ప్రభుత్వాన్ని నిందిస్తే జనాలు నమ్మే స్థితిలో లేరన్నారు. నిజంగా ప్రజలపై ప్రేమ ఉంటే.. కరోనా సంక్షోభ సమయంలో హైదరాబాద్‌లో ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. కరోనా ఉన్నన్ని రోజులు హైదరాబాద్‌లో కూర్చుని ఇప్పుడు వచ్చి ‘సాధన దీక్ష’ పేరుతో దొంగ దీక్షలు చేస్తారా? అని నిలదీశారు. ఈ దీక్షతో చంద్రబాబు ఏం సాధించారో చెప్పాలని మంత్రి ప్రశ్నించారు. దీక్షలు చేస్తే అంకితభావంతో చేయాలని, ఆ విషయంలో సీఎం జగన్‌ను చూసి చంద్రబాబు నేర్చుకోవాలని మంత్రి ఆళ్ల నాని సూచించారు. కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొన్న ముఖ్యమంత్రిపై చంద్రబాబు అక్కసు వెళ్లగక్కుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కరోనా కేసులు 25 వేలకు పైగా ఉన్నప్పుడు రాష్ట్రంలో అడుగు పెట్టకుండా హైదరాబాద్‌లో ఎందుకు కూర్చున్నారు అని చంద్రబాబును మంత్రి ఆళ్ల నాని ప్రశ్నించారు. కరోనా సమయంలో ఎందుకు దీక్ష చేయలేదని నిలదీశారు.
Also read:
Airport Drone Attack: వైమానిక స్థావరంపై దాడి కేసు విచారణ.. రంగంలోకి దిగిన NIA