Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. వారికి రూ.20 లక్షల వరకు లబ్ది.. ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు ఛాన్స్..

ఏపీ ప్రజలకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ యువత, వ్యాపారం మొదలుపెట్టాలనుకునేవారికి రుణాలు అందించనుంది. ఈ మేరకు యూనిట్లను మంజూరు చేసి స్వయం ఉపాధి పొందేలా ప్రోత్సహించనుంది. ఇందుకు సంబంధించిన యాక్షన్ ప్లాన్‌ను తాజాగా కూటమి ప్రభుత్వం విడుదల చేసింది.

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. వారికి రూ.20 లక్షల వరకు లబ్ది.. ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు ఛాన్స్..
Money

Updated on: Jan 22, 2026 | 7:38 AM

2025 – 26 ఆర్ధిక సంవత్సరానికి గాను ఎస్సీ కార్పోరేషన్ ద్వారా లబ్దిదారులకు రుణాలు అందించేందుకు ప్రభుత్వం తాజాగా కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. ఏ యూనిట్‌కు ఎంత రుణం అందిస్తారు.. ఇందుకు దరఖాస్తుల ప్రక్రియ ఎప్పటినుంచి మొదలుకానుంది అనే వివరాలను వెల్లడించింది. ప్రభుత్వం నుంచి రుణం పొంది స్వయం ఉపాధి పొందాలనుకునే యువతకు ఇది శుభవార్తగా చెప్పవచ్చు. ఏప్రిల్ 11 నుండి యూనిట్ల మంజూరుకు ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్స్ జరగనున్నాయి. మే 20 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించనుంది. దరఖాస్తు చేసుకున్న తర్వాత అధికారులు పరిశీలించి యూనిట్లను మంజూరు చేస్తారు. ఇందుకు కొన్ని అర్హతలను ప్రభుత్వం విధించింది. ఈ అర్హతలు కలిగినవారికి మాత్రమే ఉపాధి యూనిట్లు మంజూరవుతాయి. మీరు చేసే వ్యాపారాన్ని బట్టి రుణం అందిస్తారు.

రుణాలు ఎంత ఇస్తారంటే..

ప్యాసింజర్ ఆటో 4వీలర్‌కు రూ.8 లక్షలు, పాసింజర్ ఆటో3వీలర్‌కు రూ.3 లక్షలు, ఎలెక్ట్రిక్ బ్యాటరీ ఛార్జింగ్ యూనిట్‌కు రూ. 20 లక్షలు, ఎలక్ట్రిక్ ఆటోకు రూ.3 లక్షలు, పాసింజర్ కార్ (4 వీలర్)కు రూ.10 లక్షలు, గూడ్స్ ట్రక్ తదితర యూనిట్లకు రూ.10 లక్షలు, ఫ్లవర్ బొక్కే షాఫ్‌కు రూ.250000, అగ్రికల్చర్ డ్రోన్‌కు రూ.10 లక్షలు, వర్మీ కంపోస్టుకు రూ.250000, నెట్ సెంటర్‌కు రూ.270000, LED బల్బ్ యూనిట్‌కు రూ. 2.80 లక్షలు,12. ఫ్లంబింగ్, ఎలక్ట్రికల్ షాప్‌కు రూ.2.90 లక్షలు, వాటర్ బాటిల్ తయారీ యూనిట్‌కు రూ. 2.90 లక్షలు అందించనున్నారు. ఇక వాటర్ రీసైక్లింగ్ యూనిట్‌కు రూ. 2.95 లక్షలు, మొబైల్ రేపైరింగ్ షాప్‌కు రూ.310000, షోప్ డిటర్జెంట్ తయారీకి రూ. 3.2 లక్షలు, పిష్ ఫార్మింగ్‌కు రూ. 3.5 లక్షలు, కార్ వాష్‌ యూనిట్‌కు రూ.3.5 లక్షలు మంజూరు చేయనున్నారు.

ఇక బ్రిక్స్ మేకింగ్ యూనిట్‌కు రూ.3.5 లక్షలు, టూరిజం యూనిట్‌కు రూ.3.50 లక్షలు, బేకరి షాప్‌కు రూ.3.60 లక్షలు, వాటర్ ఆర్వో ప్లాంట్‌కు రూ.3.80 లక్షలు, వెల్డింగ్ ఫ్యాబ్రికేషన్‌కు రూ.385000, సోలార్ ప్రొడక్టింగ్‌కు రూ.3.90 లక్షలు, జ్యూట్ బ్యాగ్ యూనిట్‌కు రూ.3.90 లక్షలు, సోలార్ ప్యానెల్ యూనిట్ కోసం రూ.3.95 లక్షలు, కొబ్బరికాయ తోట కోం రూ.4 లక్షలు. ఫోటో షాప్‌కు రూ.4 లక్షలు, ఆయుర్వేదిక్ మెడికల్ షాపుకు రూ.4 లక్షలు, జనరల్ మెడికల్ షాప్ కోసం రూ.5 లక్షలు, బ్యూటీ పార్లర్ కోసం రూ.5 లక్షలు, మెడికల్ లాబ్ కోసం రూ.5 లక్షలు మంజూరు చేయనున్నారు.