Guntur: 2 నెలలుగా తగ్గని కడుపునొప్పి.. గుంటూరు ఆస్పత్రిలో అసలు విషయం తేలింది..

ఒంగోలుకు చెందిన ప్రసాద్, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ, వైద్యుల సహకారంతో అద్భుతంగా కోలుకున్నాడు. కాలేయంలో నీటి బుడగతోపాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడిన ప్రసాద్‌ను జిజిహెచ్ వైద్య బృందం ఆధునిక పరికరాలతో శస్త్రచికిత్స చేసి ప్రాణాలను కాపాడింది. డాక్టర్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ అరుదైన ఆపరేషన్ విజయవంతమైంది.

Guntur: 2 నెలలుగా తగ్గని కడుపునొప్పి.. గుంటూరు ఆస్పత్రిలో అసలు విషయం తేలింది..
Removed Balloon From Liver

Edited By:

Updated on: May 30, 2025 | 1:27 PM

ఒంగోలుకు చెందిన ప్రసాద్ గత రెండు నెలల నుండి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కడుపునొప్పితో ఇబ్బందిపడుతున్న ప్రసాద్ ఆసుపత్రుల చుట్టూ తిరిగాడు. అయినా రోగం నయం కాలేదు. కొద్ది రోజుల క్రితం కడుపునొప్పితో పాటు కామెర్లు కూడా కావడం, తీవ్రమైన జ్వరంతో ఒంగోలు ఆసుపత్రిలో చేరాడు. అయితే అక్కడ అన్ని వైద్య పరీక్షలు చేసిన అనంతరం ప్రసాద్ గుంటూరు జిజిహెచ్‌కు తరలించారు.

ప్రసాద్‌ను పరీక్షించిన జిజిహెచ్ మాజీ సూపరింటిండెంట్, జనరల్ సర్జన్ కిరణ్ కుమార్ అరుదైన వ్యాధిగా గుర్తించారు. కాలేయంలో నీటి బుడగ ఉన్నట్లుగా తేల్చారు. సాధారనంగా కుక్కలు తాగిన కలుషిత నీటిని సేవించడం లేదా సరిగా ఉడికించని మాంసం తినటం వలన ఈ వ్యాధి వస్తుందని కిరణ్ కుమార్ చెప్పారు. అయితే ఈ వ్యాధి మాత్రమే కాకుండా ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉండటంతో తప్సనిసరిగా శస్త్రచికిత్స చేయాలని నిర్ణయానికి వచ్చారు. ప్రవేటు ఆసుపత్రుల్లో అయితే ఈ ఆపరేషన్ చేయడానికి పది లక్షల రూపాయలు తీసుకుంటారని జిజిహెచ్‌లో ఉచితంగానే వైద్యం చేస్తామని ప్రసాద్ కు వైద్యులు తెలిపారు.

డాక్టర్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలోని వైద్య బృందం ఆధునిక పరికరాలను ఉపయోగించి అత్యంత్య క్లిష్టమైన ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. కాలేయంలోని నీటి బుడగను తొలగించారు. ఆ తర్వాత ముప్పై రోజుల పాటు జిజిహెచ్‌లోనే ఉంచి వైద్యం అందించారు. ప్రస్తుతం రోగి పూర్తిగా కోలుకున్నట్లు సూపరింటెండెంట్ రమణ యశస్వి చెప్పారు. రోగిని డిశ్చార్జ్ చేస్తున్నట్లు తెలిపారు. జిజిహెచ్‌లో అత్యంత అరుదైన శస్త్ర చికిత్సలు ఉచితంగానే చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. తన ప్రాణాలను కాపాడిన వైద్యులకు ప్రసాద్ ధన్యవాదాలు తెలిపాడు.

Patient With Doctors

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..