మదనపల్లి, జనవరి 30: అన్నమయ్య జిల్లా మదనపల్లి రూరల్ మండలంలో నాటు తుపాకీ కాల్పుల వ్యవహరం కలకలం రేపింది. వేటగాళ్ల కాల్పుల్లో తూటా తగిలి మహిళ కు తీవ్ర గాయాల పాలైంది. అపస్మారక స్థితి పడిపోయిన పాపులమ్మ అనే మహిళను స్థానికులు ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. మదనపల్లి జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. అసలేం జరిగిందంటే.. మదనపల్లి మండలం ఆవులపల్లికి చెందిన పాపులమ్మ గ్రామ సమీపంలోని పొలంలో ఉండగా వేటగాళ్లు అడవి జంతువుల కోసం వేటాడే క్రమంలో తూటాకు గురైంది. ఘటనపై ఆరా తీసిన పోలీసులు అనుమానితులను అదుపులో తీసుకుని దర్యాప్తు చేపట్టారు. వారి వద్ద నుంచి నాటు తుపాకీ నీ స్వాధీనం చేసుకున్నారు.
కాగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పడమటి ప్రాంతంలో గత కొంత కాలంగా వేటగాళ్లు రెచ్చిపోతున్నారు. తరచూ ఇలాంటి ఘటనలకు కారణం అవుతున్నారు. వేటగాళ్లు నాటు తుపాకులను విచ్చలవిడిగా వినియోగిస్తుండటంపై పోలీసు యంత్రాంగం కూడా దృష్టి సారించింది. ఈ క్రమంలో తాజా ఘటన చోటు చేసుకుంది. వెంటనే అప్రమత్తమైన పోలీస్ యంత్రంగం నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.