AP Govt: SSC పరీక్ష ఫలితాల వెల్లడికి ఫార్ములా.. హైపవర్ కమిటీ సిఫార్సులను ఓకే చేసిన రాష్ట్ర సర్కార్..

SSC results: పదో తరగతి పరీక్షల ఫలితాల వెల్లడికి ఫార్ములాను ఓకే చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రూపకల్పన కోసం నియమించిన  హైపవర్ కమిటీ సిఫార్సులను రాష్ట్ర  ప్రభుత్వం ఆమోదించింది.

AP Govt: SSC పరీక్ష ఫలితాల వెల్లడికి ఫార్ములా.. హైపవర్ కమిటీ సిఫార్సులను ఓకే చేసిన రాష్ట్ర సర్కార్..
Ap Ssc Students

Updated on: Aug 02, 2021 | 2:48 PM

పదో తరగతి పరీక్ష ఫలితాల వెల్లడికి ఫార్ములాను ఓకే చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రూపకల్పన కోసం నియమించిన  హైపవర్ కమిటీ సిఫార్సులను రాష్ట్ర  ప్రభుత్వం ఆమోదించింది. కోవిడ్ కారణంగా పరీక్షలు రద్దు కావటంతో ఫలితాలను వెల్లడికి అనువైన విధానంపై నివేదిక ఇచ్చింది హైపవర్ కమిటీ. 2020, 2021 పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల వెల్లడికి హైపవర్ కమిటీ రూపోందించిన ఫార్ములాను ఆమోదించింది ప్రభుత్వం. 2019-2020 విద్యా సంవత్సరానికి గ్రేడ్లు ప్రకటించేందుకు నిర్ణయం తీసుకుంది. 2020లో పాస్ సర్టిఫికెట్లు ఇచ్చిన వారందరికీ గ్రేడ్ పాయింట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

అంతర్గతంగా 50 మార్కుల చొప్పున నిర్వహించిన 3 ఫార్మెటివ్ అసెస్మెంట్ల ఆధారంగా ఈ గ్రేడ్లు ప్రకటించాలని స్పష్టం చేసింది. 2018, 2019 సంవత్సరాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు 2020లో పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులకు గతంలోని వారి సామర్ధ్యం ఆధారంగా 20 మార్కులకు లెక్కించి పరిగణించాలని సూచించారు.

2021 విద్యా సంవత్సరంలోని విద్యార్ధులందరికీ అంతర్గత అసెస్మెంట్ మార్కులను 30 శాతానికి 70 శాతం వెయిటేజి స్లిప్ టెస్టులకు ఇవ్వాలని సిఫార్సు చేసింది. అంతర్గత అసెస్మెంట్ పరీక్షలకు హాజరు కాని విద్యార్ధులకు పాస్ గ్రేడ్ ఇవ్వాలని సిఫార్సు చేసింది.

వొకేషనల్ విద్యార్ధులకు SSC పరీక్షల్లో వచ్చిన గ్రేడ్ల ఆధారంగా ఫలితాలు ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇవి కూడా చదవండి: Reliance Retail: ఫాస్ట్‌ఫుడ్‌ ఇండస్ట్రీపై కన్నేసిన రిలయన్స్‌.. వణికిపోతున్న డొమినోస్‌, కేఎఫ్‌సీ

Wife Murdered: చట్నీ రుచిగా లేదని భార్యను హతమార్చిన భర్త.. మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసిన దారుణం..!