Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. వారందరీ అకౌంట్లో డబ్బులు జమ.. ఇక నుంచి ప్రతీ ఏడాది రిలీజ్..

ఏపీలోని నేతన్నలకు ప్రభుత్వం శుభవవార్త అందించింది. రూ.1.67 కోట్ల నిధులను జమ చేసింది. త్రిఫ్ట్ ఫండ్ కింద వీటిని వారి ఖాతాల్లోకి రిలీజ్ చేసింది. ఇప్పటికే ఇవి చేనేతల సహకార సంఘాల్లో జమ అయ్యాయి. దీంతో ఏపీలోని నేతన్నలకు లబ్ది జరిగినట్లయింది.

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. వారందరీ అకౌంట్లో డబ్బులు జమ.. ఇక నుంచి ప్రతీ ఏడాది రిలీజ్..
Andhra Pradesh

Updated on: Jan 20, 2026 | 7:48 AM

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైతులతో పాటు రాష్ట్రంలోని చేనేతలందరికీ ఉపయోగపడేలా మరో డెసిషన్ తీసుకుంది. ధాన్యం విక్రయించిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నిధులు విడుదల చేసేలా సోమవారం ఏపీ ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. ఇకపై ఉదయం ధాన్యం ఉదయం అమ్మితే సాయంత్రాని కల్లా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి. రైతులందరికీ లబ్ది జరిగేలా ఈ నిర్ణయం ఉండగా.. ఈ క్రమంలో నేతన్నలకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ అందించింది. నేతన్నలకు త్రిఫ్ట్‌ ఫండ్‌ నిధులు విడుదల చేసింది. 2025-26కు సంబంధించి మొదటి విడత నిధులు విడుదల చేసింది. 133 చేనేత సహకార సంఘాల బ్యాంక్‌ ఖాతాల్లో రూ.1.67 కోట్లు జమ చేసింది.

5,726 మందికి బెనిఫిట్

ఈ నిధులు విడుదల చేయడం ద్వారా రాష్ట్రంలోని 5,726 మందికి లబ్ది జరిగినట్లయింది. ఈ విషయాన్ని చేనేత, జౌళిశాఖ మంత్రి సవిత ప్రకటించారు. చేనేతలకు ప్రతీ ఏటా రూ.5 కోట్ల త్రిఫ్ట్ ఫండ్‌ను అందిస్తామని ఎన్నికల సమంయలో సీఎం చంద్రబాబు, నారా లోకేష్ హామీ ఇచ్చారని, ఆ హామీ మేరకు నిధులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఇప్పుడు 2025-26 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి త్రిఫ్ట్ ఫండ్ నిధులు విడుదల చేసినట్లు సవిత వెల్లడించారు. ఇక నుంచి ప్రతీ ఏడాది త్రిఫ్ట్ ఫండ్ నిధులను సకాలంలో నేతన్నలకు అందిస్తామన్నారు. అటు సంక్రాంతి సందర్భంగా ఇటీవల చేనేత సహకార సంఘాలకు ఆప్కో ద్వారా రూ.5 కోట్ల బకాయిలను చెల్లించినట్లు స్షట్ం చేశారు. అలాగే గత ఏడాది డిసెంబర్‌లో రూ.2.42 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి సవిత పేర్కొన్నారు.

చేనేతల అభివృద్దికి చేయూత

రాష్ట్రంలోని చేనేతల అభివృద్దికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సవిత తెలిపారు. వారికి ఉపాధి కల్పిస్తామని, వాళ్లు గౌరవంతో జీవించాలనేదే తమ ప్రభుత్వం లక్ష్యమన్నారు. రెండు నెలల వ్యవధిరలోనే నేతన్నలకు రూ.9 కోట్లకుపైగా నిధులు విడుదల చేశామన్నారు. అటు ఆప్కో, త్రిఫ్ట్ బకాయిలు విడుదలపై చేనేత సహకార సహకార సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.