AP New Scheme: ఏపీలోని రైతులకు సూపర్ న్యూస్.. నేటి నుంచి కొత్త పథకం.. వారందరికీ లబ్ది

ఏపీలోని రైతులకు ఉపయోగపడేలా కూటమి ప్రభుత్వం మరో కొత్త నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. రైతులందరికీ పాడి పశువులు ఉంటాయి. వీటిపైనే వచ్చే ఆదాయం ఇంటి ఖర్చులు, ఇతర అవసరాలకు ఉపయోగపడుతూ ఉంటుంది. దీంతో పాడి పశువుల కోసం ప్రత్యేక అంబులెన్స్‌లను మంగళవారం నుంచి అందుబాటులోకి తీసుకురానుంది.

AP New Scheme: ఏపీలోని రైతులకు సూపర్ న్యూస్.. నేటి నుంచి కొత్త పథకం.. వారందరికీ లబ్ది
Ap Farmers

Updated on: Jan 20, 2026 | 8:25 AM

పాడి రైతుల కోసం ఏపీ ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రారంభించింది. పాడి పశువులపై ఆధారపడి జీవనం కొనసాగించే రైతులకు లబ్ది చేకూర్చేలా నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పాడి రైతులకు పశువులే జీవనాధారం. వాటి పెంపకం, పాలు ద్వారా వచ్చే ఆదాయంమే వారికి జీవనోపాధి. దీంతో పశువులు ఆరోగ్యంగా లేకపోయినా రైతులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. ప్రతీ గ్రామంలో పశు వైద్యశాలలు అందుబాటులో ఉండవు. మండల కేంద్రంలోనే లేదా కొన్ని గ్రామాల్లోనే వీటి సేవలు ఉంటాయి. దీంతో పశువులు అనారోగ్యానికి గురైతే అక్కడికి తీసుకెళ్లాల్సి వచ్చింది. దీని వల్ల పాడి రైతులకు సమయం వృధా అవ్వడంతో పాటు వేరే ప్రాంతానికి చికిత్స కోసం తరలించేందుకు ఖర్చు కూడా అవుతుంది. పాడి రైతులకు ఈ భారాన్ని తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి నాంది పలికింది. ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాట్లు చేయడంతో పాటు పశువుల కోసం 104 తరహాలోనే ప్రత్యేక అంబులెన్స్‌లు ప్రవేశపెట్టింది.

మంగళవారం నుంచి సేవలు

పశువులకు వైద్య చికిత్స అందించేందుకు రాష్ట్రంలో 300 అంబులెన్స్‌లను ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. వీటిల్లో 175 అంబులెన్స్‌లను 104 తరహాలోనే మార్పులు చేసింది. ఇవి మంగళవారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ అంబులెన్స్‌లు రోజుకో గ్రామంలో సేవలు అందిస్తాయి. ఒక గ్రామంలో ఉదయం నుంచి రాత్రి వరకు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ  ఉచితంగా పశువులకు వైద్య చికిత్స అందిస్తారు. పశు వైద్యశాలలు లేని గ్రామాలకు 20 రోజులకు ఒకసారి ఈ అంబులెన్స్‌లు వెళతాయి. మంగళవారం నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి రానుండగా.. పాడి రైతులకు వ్యయప్రయాసలు తప్పనున్నాయి. సోమవారం ఈ అంబులెన్స్‌లను వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించగా.. మంళవారం నుంచి ఊరూరా తిరుగుతాయని పేర్కొన్నారు.

ఉచిత పశు వైద్య శిబిరాలు

మంగళవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉచిత పశు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ శిబిరాల్లో పశువులకు ఉచితంగా వైద్య చికిత్స అందించనున్నారు. అలాగే పాడి రైతులకు 50 శాతం సబ్సిడీపై దాణా అందిస్తుండగా.. ఇన్యూరెన్స్ సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు అచ్చెన్నాయుడు చెప్పారు. పశువులకు మూడేళ్ల పాటు ఇన్యూరెన్స్ కల్పిస్తామని, రైతులందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వైపీపీ ప్రభుత్వం రూ.150 కోట్ల ఇన్యూరెన్స్ బకాయిలను నిలిపివేస్తే.. తాము అధికారంలోకి వచ్చాక విడుదల చేసినట్లు తెలిపారు. గతంలో రైతు ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చే విధానం ఉండేదని, అది విజయవంతం కాకపోవడంతో నిలిపివేసినట్లు తెలిపారు. ఈ నెల 31 వరకు ఉచిత పశు వైద్య శిబిరాలు అందుబాటులో ఉంటాయని, రైతులు ఉపయోగించుకోవాలని కోరారు.