Vahanamitra : నేటితో ఏపీలో ముగియనున్న ‘వాహనమిత్ర పథకం’ దరఖాస్తు గడువు.. ఇలా అప్లై చేసుకోండి..

|

Jun 09, 2021 | 7:22 AM

వాహనమిత్ర పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు గడువు పొడిగించింది. ఈనెల 8వతేదీ మంగళవారం వరుకు ఉన్న గడువును 9వ..

Vahanamitra : నేటితో ఏపీలో ముగియనున్న వాహనమిత్ర పథకం దరఖాస్తు గడువు.. ఇలా అప్లై చేసుకోండి..
Vahanamitra
Follow us on

Vahanamitra scheme : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్రైవర్లకు అందిస్తోన్న వాహనమిత్ర పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు గడువు పొడిగించింది. ఈనెల 8వతేదీ మంగళవారం వరుకు ఉన్న గడువును ఇవాళ (9వ తేదీ) బుధవారం వరకు పొడిగించినట్టు రాష్ట్ర రవాణాశాఖ కమిషనర్ టిఎస్ఆర్ ఆంజనేయులు తెలియజేశారు. కావున వాహన మిత్ర పథకానికి అర్హులైన వారు 9వతేది బుధవారం కూడా దరఖాస్తు చేసుకోవచ్చని కమిషనర్ తెలియజేశారు. కాగా, వాహన మిత్ర ద్వారా ప్రతి ఏటా రూ.10 వేల సాయం అందిస్తున్నారని చెప్పారు. అర్హులైన ఆటోడ్రైవర్లు అందరూ ఈ సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ఇలా ఉండగా, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 15న వైఎస్సార్‌ వాహనమిత్ర పథకం ప్రారంభింస్తున్నారు. ఇందులో భాగంగా ఆటో రిక్షా, టాక్సీ, మ్యాక్సీ, క్యాబ్‌ డ్రైవర్లకు రూ.10 వేల ఆర్థిక సాయం అందించనున్నారు.

కరోనాతో ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా గతేడాది కంటే ఈ సారి నెల ముందే ఆర్థిక సాయం అందనుంది. కొత్తగా వాహనాలు కొన్నవారు ఆర్థిక సాయం కోసం 9 లోగా దరఖాస్తు చేసుకోవాలి. అధికారులు విచారణ పూర్తి చేసి అర్హులైన వారికి ఏటా రూ.10 వేల సాయం అందిస్తారు. వైఎస్సార్‌ వాహనమిత్రకు సంబంధించిన 2 లక్షల 23 వేల 300 అర్హుల జాబితాను.. గ్రామ, వార్డు సచివాలయంలో ఇప్పటికే ప్రదర్శించారు.

అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ వాహన మిత్ర కింద ఆర్థిక సాయం అందిస్తున్నారు. వేరొక పథకంలో లబ్ది పొందుతున్నవారు, ప్రభుత్వ పించన్ పొందుతున్నవారు సాయానికి అనర్హులు. ప్రభుత్వ ఉద్యోగి కుటుంబం సహా ఆదాయ పన్ను చెల్లిస్తోన్న వారు పథకానికి అనర్హులు. ఇప్పటికే లబ్ది పొందిన వారు తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. జాబితాలో పేరున్నవారు వారి ఆటో, టాక్సీతో ఫొటో దిగి వాలంటీర్ ద్వారా అప్ లోడ్ చేయాలి.

Read also : Lockdown : గుడ్ న్యూస్ : తెలంగాణలో లాక్ డౌన్ సడలింపులు.. అక్కడ మాత్రం మామూలే..! కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలివీ..