వేల పాటలను ఆలపించిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మనమధ్య లేరు అనే వార్తని ఇప్పటికీ సంగీతప్రేమికులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం గానగంధర్వుడికి ఘనమైన నివాళి అర్పించింది. నెల్లూరులోని మ్యూజిక్,డ్యాన్స్ పాఠశాలకు డాక్టర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరును పెట్టింది ప్రభుత్వం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నెల్లూరులోనే పుట్టిపెరిగారు.
Great full to the #APgov and @ysjagan garu for this honor. https://t.co/qUvHsOP4ZM
— S. P. Charan (@charanproducer) November 27, 2020
ఇక నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ సంగీత, నృత్య పాఠశాలకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరును చేరుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ట్వీట్ చేశారు. దీనిపై ఎస్పీబీ కుమారుడు ఎస్పీ చరణ్ స్పందించారు. ప్రభుత్వ మ్యూజిక్, డ్యాన్స్ పాఠశాలకు బాలసుబ్రహ్మణ్యం పేరు పెట్టడం పై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ట్విట్టర్ ద్వారా ఏపీ ప్రభుత్వానికి , సీఎం జగన్మోహన్ రెడ్డికి చరణ్ ధన్యవాదాలు తెలిపారు.