దీపావళి నుంచి ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించనున్నట్టు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. బుధవారం జరిగిన ఏపీ కేబినేట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీపం పథకం అమలు సహా, శారదాపీఠానికి గత ప్రభుత్వ భూకేటాయింపులు రద్దు, ఇసుకపై సీనరేజ్, జీఎస్టీ రద్దుపై ఏపీ కేబినేట్ ఆమోదముద్ర వేసింది. సూపర్ సిక్స్‌లో భాగంగా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లను దీపం పథకం ద్వారా ఇవ్వనుంది రాష్ట్ర ప్రభుత్వం. అక్టోబర్ 31 నుంచి ఈ స్కీంను అమలులోకి రానుంది. ఈ పథకం కింద ప్రతీ ఏటా దాదాపుగా రూ. 2,684 కోట్ల భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడుతుందని అంచనా వేస్తున్నారు.
ఇది చదవండి: ఓ మై గాడ్.! కారు కొన్నంత ఈజీగా విమానాన్ని కొనేయొచ్చు.. ఎలాగో తెల్సా
దీపం పథకానికి ఈ నెల 27 లేదా 28 నుంచే బుకింగ్స్ ప్రారంభమవుతాయన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి రేషన్‌కార్డ్ ప్రామాణికం కాగా.. ఎల్‌పీజీ కనెక్షన్ ఉన్న అర్హులైన ప్రతి కుటుంబానికి ఈ స్కీమ్ వర్తిస్తుందన్నారు. ప్రతి 4నెలలకు ఒకసారి సిలిండర్ పొందే అవకాశం ఉందన్నారు. వచ్చే ఏడాది మూడు సిలిండర్లను ఇచ్చేందుకు ఒక షెడ్యూల్‌ను ఖరారు చేశామన్నారు. ఏప్రిల్-జూలై మధ్య మొదటి సిలిండర్, ఆగష్టు-నవంబర్ మధ్య రెండో సిలిండర్, డిసెంబర్-మార్చి 31 మధ్య మూడో సిలిండర్‌ను ఇవ్వనున్నట్టు తెలిపారు. లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో సబ్సిడీ అమౌంట్‌ను 48 గంటల్లో జమ చేస్తామంది రాష్ట్ర ప్రభుత్వం.
ఇది చదవండి: మంచు కొండల్లో అదో మాదిరి వింత ఆకారం.. విషయం తెలిస్తే.. అయ్యబాబోయ్.!
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..