
చాలా మందిని ఆర్థిక సమస్యలు, ఇతర కారణాలు వెంటాడుతుంటాయి. ఆర్థిక సమస్యలు పెరిగిపోడంతో చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. దేశంలో ఇలా ఆర్థిక సమస్యల కారణంగా ఎంతో మంది ప్రాణాలు వదులుకున్నారు. కుటుంబ పెద్దనే కాకుండా మొత్తం ఇంటిల్లిపాది కూడా ఆత్మహత్యలకు పాల్పుడుతుంటారు. కుటుంబ సభ్యులు ఆత్మహత్యకు పాల్పడ్డారంటే ముఖ్యం ఆర్థిక సమస్యలే ఉంటాయి. క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతూ తమ విలువైన జీవితాన్ని పోగొట్టుకుంటున్నారు. ఇతర కారణాల వల్ల చనిపోయినవారు ఉన్నా… ఆత్మహత్యలకు కారణాలు ఎక్కువగా ఆర్థిక సమస్యలే ఉంటాయని పోలీసులు వెల్లడిస్తున్నారు.
ఇక తాజాగా ఏపీలో విషాదం చోటు చేసుకుంది. అనకాపల్లిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుల్లో ఇద్దరు కుమార్తెలు, తల్లిదండ్రులున్నారు. మృతులు రామకృష్ణ, దేవి, వైష్ణవి, జాహ్నవి ఉండగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో కుమార్తె ప్రియా మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఆత్మహత్యకు కారణాలు ఆర్థిక సమస్యలేనని చెబుతున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.