Andhra Pradesh: చిలకలూరిపేట టీడీపీలో చిచ్చు.. సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రత్తిపాటి పుల్లారవు..

ఉమ్మడి గుంటూరు జిల్లా టీడీపీలో వర్గపోరు రచ్చకెక్కడం పార్టీ అధిష్టానానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. నిన్న సత్తెనపల్లి.. ఇవాళ చిలకలూరిపేట. మొదటి నుంచి పార్టీ కోసం పని చేసిన కుటుంబాన్ని కాదని.. అప్పటికప్పుడు పార్టీలో చేరిన వారికి బాధ్యతలు ఇవ్వడంతో మరో వర్గం నేతలకు మింగుడు పడడంలేదు. టికెట్ల విషయంలోనూ..

Andhra Pradesh: చిలకలూరిపేట టీడీపీలో చిచ్చు.. సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రత్తిపాటి పుల్లారవు..
Prathipati Pullarao

Updated on: Jun 03, 2023 | 6:30 AM

ఉమ్మడి గుంటూరు జిల్లా టీడీపీలో వర్గపోరు రచ్చకెక్కడం పార్టీ అధిష్టానానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. నిన్న సత్తెనపల్లి.. ఇవాళ చిలకలూరిపేట. మొదటి నుంచి పార్టీ కోసం పని చేసిన కుటుంబాన్ని కాదని.. అప్పటికప్పుడు పార్టీలో చేరిన వారికి బాధ్యతలు ఇవ్వడంతో మరో వర్గం నేతలకు మింగుడు పడడంలేదు. టికెట్ల విషయంలోనూ నేతల మధ్య పంతాలు పట్టింపులతో పొలిటికల్‌ హీట్‌ పెరిగింది.

గుంటూరు జిల్లా చిలకలూరిపేట టీడీపీలో చిచ్చు రేగింది. ఇప్పటికే సత్తెనపల్లి టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను నియమించడంపై శివరాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో శివరాంను బుజ్జగించేందుకు హైకమాండ్ రంగంలోకి దిగింది. ఇదిలా ఉంటే టీడీపీలో గత కొన్నిరోజులుగా నెలకొన్న పరిణామాలపై మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్తిపాటి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ముఖ్యంగా.. టీడీపీలో హాట్‌టాపిక్‌గా మారింది.

చిలకలూరిపేట టీడీపీ అభ్యర్ధిగా గత కొంతకాలం నుంచి భాష్యం ప్రవీణ్ పేరు వినిపిస్తోంది. ఈసారి హైకమాండ్ భాష్యం ప్రవీణ్‌ను రంగంలోకి దించిందంటూ ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో పుల్లారావు స్పందించారు. అసలు చిలకలూరిపేటకు భాష్యం ప్రవీణ్‌కు సంబంధం ఏంటీ అని ప్రశ్నించారు. వలసనేతలకు ఇక్కడేం పని అంటూ సూటిగా ప్రశ్నలు సంధించారు. అతనికి ఇక్కడ కనీసం ఓటు హక్కు కూడా లేదని పుల్లారావు దుయ్యబట్టారు. ఫౌండేషన్, ట్రస్టుల పేర్లతో వచ్చే వారిని ఎంటర్‌టైన్ చేస్తే ఎలా అని ప్రశ్నించారు. ఇప్పుడెదో రూ.కోటితో హడావుడి చేస్తారని.. తర్వాత చేతులెత్తేస్తారని పత్తిపాటి ఆరోపించారు. పార్టీని పట్టించుకోకుండా సీనియర్లు తిరుగుతున్నారంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని పుల్లారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడో పది వేలు, ఇక్కడో రూ.10 వేలు ఖర్చు పెట్టేవారికి టికెట్లు ఇచ్చేస్తారంటూ ఆయన మండిపడ్డారు.

ఇవి కూడా చదవండి

మొత్తానికి చూస్తే.. అటు సత్తెనపల్లి పంచాయితీకి ఫుల్‌స్టాప్ పడకముందే ఇప్పుడు చిలకలూరిపేట వ్యవహారం తెరపైకి వచ్చింది. ఈ రెండు నియోకవర్గాల విషయంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..