Andhra Pradesh: ప్రభుత్వ విధానాలపై పోరాటానికి సిద్ధం.. విజయవాడ సమావేశంలో బీజేపీ కీలక నిర్ణయం..

|

Aug 29, 2022 | 9:21 PM

వినాయక చవితికి ఫైర్‌, విద్యుత్‌, పోలీస్‌ పర్మిషన్‌ ఎందుకు తీసుకోవాలని సోము ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ రూల్స్‌ స్వయంగా రాష్ట్ర డీజీపీనే ప్రకటించడం విషాదరకరమని అన్నారు.

Andhra Pradesh: ప్రభుత్వ విధానాలపై పోరాటానికి సిద్ధం.. విజయవాడ సమావేశంలో బీజేపీ కీలక నిర్ణయం..
Andhra Pradesh Bjp Meeting
Follow us on

విజయవాడలో జరుగుతున్న బీజేపీ పదాధికారుల సమావేశంలో కమలం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాయలసీమలో పెండింగ్‌ ప్రాజెక్టుల పూర్తికి డిమాండ్‌ చేసింది. బీజేపీ బలోపేతం కోసం ఏపీలోని 25 చోట్ల బహిరంగ సమావేశాలు, సభలు ఏర్పాటుకు నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని బీజేపీ నేతలు నిర్ణయించారు.

ఈమేరకు సోమువీర్రాజు మాట్లాడుతూ, ఏపీలో జగన్‌ సర్కార్‌ వినాయక ఉత్సవాల ఆంక్షలను బీజేపీ వ్యతిరేకిస్తోందన్నారు. ఇతర మతస్థుల పండుగలకు లేని ఆంక్షలు హిందువుల పండుగలకు ఎందుకు పెడుతుందోని ఆయన ప్రశ్నించారు. వినాయక చవితికి ఫైర్‌, విద్యుత్‌, పోలీస్‌ పర్మిషన్‌ ఎందుకు తీసుకోవాలని సోము ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ రూల్స్‌ స్వయంగా రాష్ట్ర డీజీపీనే ప్రకటించడం విషాదరకరమని అన్నారు. ఈ నిబంధనలపై సీఎం జగన్‌ స్పందించాలని సోము డిమాండ్‌ చేశారు.