Andhra Pradesh: గంటల వ్యవధిలో తండ్రీ, కొడుకులు మృతి.. అంతులేని విషాదంలో కుటుంబం

Andhra Pradesh: మనస్థాపంతో తీవ్ర మనోవేదనతో గుండెపోటుకు గురై తండ్రీ కూడా మరణించాడు. దీంతో ఆ కుటుంబంలో అంతులేని విషాదం చోటు చేసుకుంది. తండ్రీ కొడుకుల మృతదేహాల పాడెలను తీసుకెళుతుంటే ఆ దశ్యాలను చూసిన గ్రామస్థులు కంటతడి పెట్టుకున్నారు. పగవాడికి కూడా..

Andhra Pradesh: గంటల వ్యవధిలో తండ్రీ, కొడుకులు మృతి.. అంతులేని విషాదంలో కుటుంబం

Edited By:

Updated on: May 27, 2025 | 5:32 AM

పగవాడికి కూడా వారికి వచ్చిన కష్టం రాకూడదు అంటారు. అలాంటి విషాద ఘటనే ఆ కుటుంబంలో చోటు చేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతూ కొడుకు చనిపోయిన గంటల వ్యవధిలోనే కొడుకు లేడన్న మనస్థాపంతో తీవ్ర మనోవేదనతో గుండెపోటుకు గురై తండ్రీ కూడా మరణించాడు. దీంతో ఆ కుటుంబంలో అంతులేని విషాదం చోటు చేసుకుంది. తండ్రీ కొడుకుల మృతదేహాల పాడెలను తీసుకెళుతుంటే ఆ దశ్యాలను చూసిన గ్రామస్థులు కంటతడి పెట్టుకున్నారు. పగవాడికి కూడా ఆ కుటుబానికి వచ్చిన కష్టం రాకూడదని కన్నీరుమున్నీరయ్యారు.

బాపట్ల జిల్లా పర్చూరు మండలం నాగులపాలెంలో విషాదం చోటుచేసుకుంది. గంటల వ్యవధిలో తండ్రి కొడుకులు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు భోరున విలపిస్తున్నారు. గ్రామానికి చెందిన పోట్రు మణికంఠ (35) అనారోగ్యంతో గతరాత్రి ఇంటి దగ్గరే మృతి చెందాడు. మృతి చెందిన విషయాన్ని ఆయన తండ్రి పోట్రు హరిబాబు(55) తెలియజేశారు. కుమారుడి మరణవార్తని తట్టుకోలేక పోయిన తండ్రి హరిబాబు ఒక్కసారిగా తీవ్ర గుండె పోటుకి గురయ్యారు. ఇంటి దగ్గరే చికిత్స పొందుతూ తండ్రి కూడా కొడుకు చనిపోయిన గంటల వ్యవధిలోనే చనిపోయాడు. రెండు మృతదేహాలను ఒకేసారి మోసుకొని వెళుతున్న దృశ్యాన్ని చూసిన బంధువులు, కుటుంబ సభ్యుల రోదనలు మాటల్లో చెప్పనలవి కావు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి