Road Accident: కుటుంబాన్ని చిదిమేసిన ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు బలి
Road Accident: ప్రమాదం జరిగిన విషయాన్ని లారీ డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇచ్చారని నార్త్ జోన్ డిఎస్పి శ్రీకాంత్ వెల్లడించారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా అకస్మాత్తుగా యూటర్న్ చేసుకునే క్రమంలో కొవ్వూరు నుంచి కాకినాడ వైపు వస్తున్న వీరి వాహనం బలంగా..

తూర్పుగోదావరి జిల్లా ఆటోనగర్ వద్ద జరిగిన ఘోర రోడ్ ప్రమాదంలో ఓ కుటుంబాన్ని మృత్యువు కబలించింది. అప్పటిదాకా సంతోషంగా సాగిన కుటుంబ ప్రయాణం రెప్పపాటున కడతేరింది. సెలవులు కావడంతో కాకినాడలో హాస్టల్లో చదువుకుంటున్న మనవరాల్ని చూసేందుకు ఎంతో ఆత్రుతగా వెళుతున్న ఆ కుటుంబాన్ని చిదివేసింది. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండల ప్రాంతానికి చెందిన రెండు కుటుంబాలు మృత్యువాత పడడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి.
నలుగురు మృతి చెందడంతో కుటుంబంలో కన్నీరు మున్నీరుగా రోధను వినిపిస్తున్నాయి. అల్లుడు కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇదంతా లారీ డ్రైవర్ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. అతివేగంగా రావడంతో ఎదురుగా ఉన్న లారీని ఢీకొనే క్రమంలో తప్పించిపోయి ఒక్కసారిగా డివైడ్ అవతలికి వెళ్లడంతో అడ్డుగా వెళుతున్న కారు ఢీకొనగా అంతా జరిగిపోయింది. మృతులు రెప్పపాటు ప్రమాదం కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. ఉప్పులూరి ప్రసాద్ (58), ఉప్పులూరి లీలావతి ( 54) ఇమ్మని సత్యవతి (72),లక్కంసాని బిందు ( 33), పోలీసులు మృతదేహాలను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదం జరిగిన విషయాన్ని లారీ డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇచ్చారని నార్త్ జోన్ డిఎస్పి శ్రీకాంత్ వెల్లడించారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా అకస్మాత్తుగా యూటర్న్ చేసుకునే క్రమంలో కొవ్వూరు నుంచి కాకినాడ వైపు వస్తున్న వీరి వాహనం బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సిసి ఫుటేజ్ ఆధారంగా ప్రమాద సమయంలో జరిగిన ఘటనను ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్ ఇంకా పరారీలో ఉన్నట్లుగా తెలుస్తుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




