AP Rains: అక్కడ ఎండ.. ఇక్కడ వర్షం.. ఆంధ్రాలో చిత్రవిచిత్ర వాతావరణం.. పూర్తి వివరాలు

అక్కడ ఎండ.. ఇక్కడ వర్షం.. ఏపీలో చిత్ర విచిత్రమైన వాతావరణం నెలకొంది. దీనికి వచ్చే 3 రోజులు వాతావరణ శాఖ ఎలాంటి హెచ్చరికలు జారీ చేసిందో.. ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి ఏమంటారు.? లేట్ ఎందుకు ఓ సారి లుక్కేయండి.

AP Rains: అక్కడ ఎండ.. ఇక్కడ వర్షం.. ఆంధ్రాలో చిత్రవిచిత్ర వాతావరణం.. పూర్తి వివరాలు
Ap Rains

Updated on: Feb 26, 2025 | 2:00 PM

నిన్నటి పశ్చిమ గాలుల ద్రోణి, గంగా పరివాహక పశ్చిమ బెంగాల్ నుంచి ఒడిశా మీదుగా దక్షిణ ఛత్తీస్‌గఢ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో విస్తరించి, ఈరోజు తక్కువగా గుర్తుంచబడినది. దిగువ ట్రోపో ఆవరణంలో కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం, రాయలసీమలో ఈశాన్య, ఆగ్నేయ దిశగా గాలులు వీస్తున్నాయి.

—————————————-

వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు:
———————————-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:-

ఈరోజు:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.

రేపు:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.

ఎల్లుండి:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-

ఈరోజు:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.

రేపు:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.

ఎల్లుండి:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.

రాయలసీమ:-

ఈరోజు, రేపు:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.

ఎల్లుండి:- తేలికపాటి నుంచి మోస్తరు వర్షం ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి