‘ఎవడండీ గంటా? లక్షల్లో వాడొక్కడు. లక్షల్లో నేనొక్కడిని. గంటా ఏమైనా పెద్ద నాయకుడా? ప్రధానా? పార్టీలో అందరూ రావాలి.. పార్టీ కోసం అందరూ పని చేయాలి. కష్టకాలంలో కూడా పార్టీ కోసం పని చేయాలనేదే మా కోరిక.’ ఇవీ మాజీ మంత్రి గంటా శ్రీనివాస్‌పై మరో మంత్రి అయ్యన్న పాత్రుడు చేసిన షాకింగ్ కామెంట్స్. మరి ఆయన ఎందుకు అంతలా ఫైర్ అయ్యారు. ఇంకా ఏమేం అన్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
అమరావతిలో మీడియాతో మాట్లాడిన టీడీపీ నేత, మాజీ మంత్ర అయ్యన్న.. గంటా శ్రీనివాస్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇన్ని రోజులు గప్‌చుప్‌గా ఇంట్లో దాక్కుని, ఎన్నికలు వస్తుండగానే బయటకు వస్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటానే కాదు.. పార్టీ కష్టా్ల్లో ఉన్న సమయంలో బయటకు రాని నేతలందరికీ ఆయన గట్టిగానే క్లాస్ ఇచ్చారు.
‘మేం ఎవ్వరికీ వ్యతిరేకులం కాదు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు బొక్కల్లో దాక్కుని.. ఎన్నికలు వస్తున్నాయని మళ్లీ వస్తున్నారు. పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు కూడా పార్టీకి అండగా ఉండాలనే మేం కోరుకుంటున్నాం. అలా అండగా ఉండని వారిని చూస్తేనే మాకు బాధేస్తుంది. మాకు అందరూ కావాలి. పార్టీ కష్టకాలంలో దూరంగా ఉన్నవాళ్లు కూడా బాగుండాలనే కోరుకుంటాం. టీడీపీకి మొదట్నుంచి బడుగులే అండగా ఉన్నారు. టీడీపీ బీసీలకే పెద్ద పీట వేసింది. పార్టీ అధికారంలో ఉన్నా.. లేకున్నా బీసీలు టీడీపీకి అండగానే ఉన్నారు. త్వరలో టీడీపీ బీసీ నేతల సమావేశం ఉంటుంది. మూడు ప్రాంతాల్లో బీసీ సదస్సులు పెడతాం.’ అన్నారు.
‘వైసీపీ పాలనలో సాఫ్ట్ వేర్ కంపెనీ.. హార్డ్ వేర్ కంపెనీలే కాదు.. అండర్ వేర్ కంపెనీలు కూడా పోతున్నాయి. జాకీ అండర్ వేర్ కంపెనీని కేటీఆర్ పట్టుకుపోయారు. రాజధాని లేని దిక్కుమాలిన రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయింది. భారతీ సిమెంట్స్ ధర మిగిలిన వాటికంటే రూ. 20 ఎక్కువ. సీఎం జగన్ భార్య కంపెనీ అనేనా ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. బ్రాందీ షాపులను 25 ఏళ్ల తనఖా పెట్టి.. రూ. 8700 కోట్లు అప్పు తెస్తారా? బ్రాందీ షాపులను తనఖా పెట్టిన దౌర్భాగ్యుడని తెలియక ప్రజలు ఓటేశారు. దావోస్ సదస్సుకు అందరికీ ఒకే ఆహ్వానం ఇస్తారని మంత్రి అమర్నాధ్ కు తెలీదా? పొరుగు రాష్ట్రం ఐటీ మంత్రి ఏం చేస్తున్నారో చూసి నేర్చుకో అమర్నాధ్. మాలాంటి వారిని తిట్టడానికే అమర్నాధుకు మంత్రి పదవి ఇచ్చారు.’ అంటూ వైసీపీ ప్రభుత్వంపైనా నిప్పులుచెరిగారు అయ్యన్న.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..