Andhra Pradesh: ఆ పాపం చంద్రబాబుదే.. టీడీపీ నేతలపై సంచలన కామెంట్స్ చేసిన ఆంధ్రప్రదేశ్ మంత్రి..

Andhra Pradesh: టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ ప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తీరును తూర్పారబట్టారు.

Andhra Pradesh: ఆ పాపం చంద్రబాబుదే.. టీడీపీ నేతలపై సంచలన కామెంట్స్ చేసిన ఆంధ్రప్రదేశ్ మంత్రి..
Dharmana

Updated on: Nov 05, 2021 | 1:32 PM

Andhra Pradesh: టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ ప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తీరును తూర్పారబట్టారు. శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడి ఆయన.. రాష్ట్ర రైతాంగానికి మంచి చేయాలని ఉద్దేశ్యంతో చేపట్టిన జలయజ్ఞాన్ని నిర్వీర్యం చేసిన పాపం చంద్రబాబుదే అని విమర్శించారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి భయపడుతూ ఇతర పార్టీలతో పొత్తుల వ్యవహారం నడుపుతున్నారని, ఇంతకు మించి సిగ్గుచేటు పని ఇంకోటి లేదని హాట్ హాట్ కామెంట్స్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధిని గాలికి వదిలేసిన టీడీపీ నేతలు.. నేడు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు రైతుల సమస్యలు పట్టించుకోని టీడీపీ.. నేడు రైతుల సమస్యలపై ఆందోళన చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బద్వేలు ఎన్నికల్లో జనసేన పార్టీ బీజేపీకి బహిరంగంగా మద్దతు ఇస్తే, టీడీపీ మాత్రం రహస్య మద్ధతు ఇచ్చి భంగపడిందన్నారు. టీడీపీని కాపాడుకునేందుకు జనసేన, బీజేపీల సహాయాన్ని చంద్రబాబు అర్థిస్తున్నారని ధర్మాన ఎద్దేవా చేశారు. ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నా.. రాష్ట్రంలో టీడీపీ కోలుకోవడం సాధ్యం కాదని జోస్యం చెప్పారు ఉపముఖ్యమంత్రి ధర్మాన.

ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ పాలనపై ప్రశంసలు కురిపించారు ధర్మాన కృష్ణ దాస్. ప్రజలకు జవాబు దారీగా ఉంటూ అభివృద్ధి, సంక్షేమ దిశగా ముఖ్యమంత్రి పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసే విమర్శలను సీఎం అసలు పట్టించుకోవడం లేదన్నారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించిందని తెలిపారు. వంశధార నదిపై నేరేడు బ్యారేజ్ నిర్మించే విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒడిషా వెళ్తారని ధర్మాన తెలిపారు. ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చించి నేరేడు బ్యారేజ్ నిర్మాణానికి ఉన్న ఆటంకాలు తొలిగిపోయేలా చేస్తారని చెప్పారు.

Also read:

Diwali 2021: బాణసంచా కాలుస్తుండగా ప్రమాదం.. నిప్పురవ్వలు పడి అగ్నికి ఆహుతైన కారు..

Weather Alert: బంగాళాఖాతంలో అల్ప‌పీడ‌నం.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల‌కు రెయిన్ అల‌ర్ట్

Crime News: భర్తమీద కోపం బిడ్డలపై చూపించింది.. ఐదుగురి పిల్లల్ని కర్కశంగా హతమార్చిన తల్లికి జీవిత ఖైదు..