Vizag Serial killer: వైజాగ్ సైకో కిల్లర్‌ అరెస్ట్‌! ఒంటరి మహిళలే లక్ష్యంగా హత్యలు.. ఆపై అత్యాచారం..

|

Aug 16, 2022 | 9:43 PM

విశాఖపట్నంలో వరుస హత్యలతో కలకలం సృష్టించిన మిస్టరీ వీడింది. ఎట్టకేలకు సీరియల్ కిల్లర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ రోజు (ఆగస్టు 16) విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను సీపీ శ్రీకాంత్‌ వెల్లడించారు..

Vizag Serial killer: వైజాగ్ సైకో కిల్లర్‌ అరెస్ట్‌! ఒంటరి మహిళలే లక్ష్యంగా హత్యలు.. ఆపై అత్యాచారం..
Vizag Serial Killer
Follow us on

Vizag Serial killer arrested by police: విశాఖపట్నంలో వరుస హత్యలతో కలకలం సృష్టించిన మిస్టరీ వీడింది. ఎట్టకేలకు సీరియల్ కిల్లర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ రోజు (ఆగస్టు 16) విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను సీపీ శ్రీకాంత్‌ వెల్లడించారు. కుటుంబం దూరం కావడం, పలువురి చేతిలో మోసపోవడంతో మతి స్థిమితం కోల్పోయి అతి కిరాతకమైన క్రిమినల్‌గా మారినట్లు సీపీ శ్రీకాంత్ వివరించారు. సీపీ మీడియాతో మాట్లాడుతూ..

‘అనకాపల్లి జిల్లా కోటౌరట్ల పరిధిలోని దర్మ సాగరం గ్రామానికి చెందిన చందక రాంబాబు (49)గా పోలీసులు గుర్తించారు. బతుకుదెరువు కోసం విశాఖ నగరంలోని దేవాలయాలు, ఫంక్షన్‌ హాళ్ల దగ్గర నివసిస్తూ ఉండేవాడు. 18 యేళ్ల వయసులో రాజమండ్రికి చెందిన యువతితో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె సంతానం. తాపీ మేస్త్రీగా, ఆటో రిక్షా డ్రైవర్‌గా పనిచేసిన అతడు హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా కూడా పనిచేశాడు. హైదరాబాద్‌లో తమ ఇంటి యజమానితో భార్య అక్రమ సంబంధాన్ని పెంచుకుదని 2018లో భార్యభర్తలిద్దరూ విడిపోయారు. భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత ఇద్దరు పిల్లలు అతడిని దగ్గరకు రానివ్వడం లేదు. హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ సంస్థలో ఏజెంట్‌గా పనిచేసి మోసానికి గురయ్యాడ’ని సీపీ తెలిపాడు.

ఇవి కూడా చదవండి

‘అక్టోబర్ 2021 లో వైజాగ్‌లోని పెందుర్తికి వచ్చిఅద్దె ఇంట్లో ఉంటున్నాడు. క్షుద్రపూజలు చేస్తున్నాడని ఇంటి యజమాని అతన్నిగెంటివేశారు. తన భార్యకు వేరే వ్యక్తితో సంబంధం ఉందని తెలుసుకుని, యజమాని చేతిలో మోసపోయాడని తెలుసుకుని మహిళలపై ద్వేషం పెంచుకుని వరుస హత్యలకు పాల్పడ్డాడు. ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుని హత్యలకుపాల్పడేవాడు. గత వారం వృద్ధ దంపతులను చంపడం ద్వారా భీభత్సం సృష్టించాడు. అనంతరం నిర్మాణంలో ఉన్న భవనాలకు వాచ్‌మెన్‌లుగా పనిచేస్తున్న ముగ్గురు వ్యక్తుల కుటుంబాలను హత్య చేశాడు. ఈ హత్యలన్నింటికీ ఇనుపరాడ్డును ఉపయోగించాడు. రాడ్డుతో తలపై మోది చంపేవాడు. అనంతరం మహిళలపై అత్యాచారం చేసేవాడు. రాంబాబు వద్ద సెల్‌ఫోన్‌ లేకపోవడంతో అతన్ని పట్టుకోవడం కష్టమైంది. నిందితుడు ఆలయాలు, ఫంక్షన్‌ హాళ్లలో తింటూ హత్యలకు పాల్పడ్డాడు. గత కొంత కాలంగా నిందితుడి మానసిక స్థితి సరిగాలేదు. సోమవారం రాత్రి అనుమానాస్పదంగా సంచరిస్తున్న సీరియల్ కిల్లర్‌ రాంబాబును పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని విచారించిన తర్వాత మరిన్ని విషయాలు తెలిసే అవకాశముందని’ సీపీ తెలిపారు.