AP CM YS Jagan: ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిపై సీఎం జగన్ సీరియస్.. అధికారులకు కీలక ఆదేశాలు..

| Edited By: Janardhan Veluru

Aug 19, 2021 | 4:37 PM

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇటీవల వెలుగుచూసిని అవినీతి భాగోతంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు.

AP CM YS Jagan: ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిపై సీఎం జగన్ సీరియస్.. అధికారులకు కీలక ఆదేశాలు..
Cm Jagan
Follow us on

AP CM YS Jagan Revenue Review:  ఆంధ్రప్రదేశ్‌లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇటీవల వెలుగుచూసిన అవినీతి భాగోతంపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు. ప్రభుత్వ ఆదాయానికి గండికొడితే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేంది లేదని సీఎం జగన్ స్పష్టం చేశారు. గురువారంనాడు సీఎం క్యాంపు కార్యాలయంలో రాష్ట్రానికి ఆదాయ వనరులపై సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్టానికి ఆదాయవనరులు అందించే అన్ని శాఖల అధికారులతో సీఎం జగన్‌ సమావేశమై కొత్త ఆదాయ మార్గాలపై వారితో చర్చించారు. అసలు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో నకిలీ చలాన్లు ఎలా వచ్చాయి? ఏసీబీ దాడులు చేస్తే తప్ప ఈ వ్యవహారం వెలుగులోకి రాలేదు అంటూ సీఎం జగన్‌ అసహనం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని రెవెన్యూ శాఖ అధికారులను ప్రశ్నించారు. అక్రమాలకు పాల్పడ్డ అధికారులను సస్పెండ్ చేశామని అధికారులు సీఎం జగన్‌కి వివరించారు.

రాష్ట్ర ఖజానాకు చేరాల్సిన బకాయిలపై దృష్టిపెట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆదాయ వనరుల పరిస్థితులను మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతిఏటా సహజంగా పెరిగే ఆదాయ వనరులు సరిగ్గా వచ్చేలా చూడాలన్న సీఎం.. జీఎస్టీ వసూళ్ల ద్వారా అదనపు ఆదాయం వచ్చేలా చూసుకోవాలన్నారు. రాష్ట్రానికి కొత్త ఆదాయ మార్గాలపైన కూడా దృష్టిపెట్టాలని సూచించారు. ఆదాయ వనరులపై వినూత్న సంస్కరణలు తీసుకురావాలని సూచించిన సీఎం జగన్.. అదే సమయంలో ప్రభుత్వ శాఖల్లో అవినీతికి అడ్డుకట్ట వేయాలని ఆదేశించారు.

అవినీతి కార్యకలాపాలపై క్షేత్రస్థాయిలో ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం తెప్పించుకోవాలని సీఎం జగన్ ఉన్నతాధికారులను ఆదేశించారు. అవినీతిపై ఎవరికి కాల్‌ చేయాలో ప్రతి ఆఫీసులోనూ నంబర్‌ ఉంచాలని.. సదరు కాల్‌ సెంటర్‌కు వచ్చే కాల్స్‌పై అధికారులు దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. సబ్‌రిజిస్ట్రార్‌ సహా అన్ని ఆఫీసుల్లోనూ చెల్లింపు ప్రక్రియ పరిశీలించాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో సాఫ్ట్‌వేర్ మొత్తాన్ని నిశితంగా పరిశీలించామన్న ఆర్థికశాఖ అధికారులు.. అవినీతికి చోటు లేకుండా పూర్తిస్థాయిలో మార్పులు చేశామని తెలిపారు. మీ సేవల్లో పరిస్థితులపైనా పరిశీలన చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

Read Also… Modi Temple: ప్రధాని మోడీకి గుడికట్టిన బీజేపీ కార్యకర్త.. పీఎంవో అభ్యంతరాలతో రాత్రికి రాత్రే తొలగింపు