CM YS Jagan mohan reddy Kadapa and Badvel Visit : సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 8, 9 తేదీల్లో కడప జిల్లాలో పర్యటించనున్నారు. 9వ తేదీ బద్వేలులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మున్సిపాలిటీతో పాటు నియోజకవర్గానికి సంబంధించిన సుమారు రూ.400 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహిస్తారు. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి బద్వేలుకు వస్తున్న వస్తున్న తరుణంలో జిల్లా యంత్రాంగం జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
ఈ నేపథ్యంలో బద్వేలులోని పలు ప్రాంతాలను కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, కలెక్టర్ సి.హరికిరణ్, మాజీ ఎమ్మెల్సీ డీసీగోవిందరెడ్డి ఇప్పటికే పరిశీలించారు. ఇందులో భాగంగా స్థానిక బైపాస్‌రోడ్డులోని బహిరంగ సభ స్థలాన్ని, హెలిప్యాడ్‌కు సంబంధించి సిద్దవటం రోడ్డులోని ఓ స్థలాన్ని, మైదుకూరురోడ్డులోని ఓ స్థలాన్ని పరిశీలించారు.
కాగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ సి.హరికిరణ్ తెలిపారు. జేసీలు గౌతమి, ధర్మచంద్రారెడ్డి, సబ్ కలెక్టర్ కేతన్‌గార్గ్, అడా చైర్మన్ సింగసానిగురుమోహన్ తదితరులు సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించారు.
Read also : తెలంగాణ సర్కారు ఇచ్చిన జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేసిన ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా రైతులు