AP CM YS Jagan: క్రీడాకారులతో కలిసి క్రికెట్‌ ఆడిన ఏపీ సీఎం.. మంత్రి రోజాకు బ్యాటింగ్‌ నేర్పించిన జగన్‌

|

Dec 26, 2023 | 3:41 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలను ప్రారంభించారు. గుంటూరు జిల్లా నల్లపాడులోని లయోల కాలేజీలో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. జగన్ ఉత్సాహంగా క్రికెట్ ఆడారు.

AP CM YS Jagan: క్రీడాకారులతో కలిసి క్రికెట్‌ ఆడిన ఏపీ సీఎం.. మంత్రి రోజాకు బ్యాటింగ్‌ నేర్పించిన జగన్‌
Ys Jagan Rk Roja
Follow us on

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కే రోజాకు ఉన్న క్రేజీ అందరికీ తెలిసిందే. సినిమా రంగంలోనూ, వైసీపీ నేతగా సంచలన వ్యాఖ్యలతో ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువ‌త‌ను, ముఖ్యంగా క్రీడాకారుల‌ను ప్రోత్సహించేందుకు సరికొత్త కార్యక్రమంతో ముందుకు వచ్చింది. ముఖ్యమంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నిర్ణయం మేర‌కు గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఆట‌ల‌పండుగ‌ నిర్వహిస్తోంది స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్.

ఈ క్రమంలోనే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలను ప్రారంభించారు. గుంటూరు జిల్లా నల్లపాడులోని లయోల కాలేజీలో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. సీఎం వైఎస్ జగన్ ఉత్సాహంగా క్రికెట్ ఆడారు. అక్కడే ఉన్న మంత్రి రోజాను సైతం క్రికెట్ ఆడాలంటూ ప్రోత్సహించారు. క్రికెట్ ఆడేందుకు అఇష్టత చూపుతున్న రోజాకు సీఎం జగన్ బ్యాటింగ్ నేర్పించారు. బ్యాటింగ్ చేయడానికి జంకుతున్న రోజాను ప్రోత్సహించారు. బ్యాట్ ఎలా పట్టుకోవాలి? గ్రిప్ పొజిషన్ ఎలా ఉండాలి? స్టాన్స్ ఎలా ఉండాలి? అనే అంశాలను వివరించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్‌ అవుతున్నాయి.

ఇదిలావుంటే, నగరి టికెట్‌పై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్కే వైసీపీకి దూరం కాలేదన్నారు. ఆయన గత ఎన్నికల్లోనే పోటీకి దూరంగా ఉంటానని చెప్పారన్నారు రోజా. సామాజిక కోణంలోనే మార్పులు చేర్పులు జరుగుతున్నాయన్న రోజా.. తనకు నగరి టికెట్ ఇవ్వకున్నా మనస్పూర్తిగా వదులుకుంటానని స్పష్టం చేశారు. అయితే తనకు టిక్కెట్‌ నిరాకరిస్తారని అనుకోవడం లేదన్నారు. జగన్‌ పాలనపై రాష్ట్రంలో ఎవరూ అసంతృప్తిగా లేరన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…