CM Jagan: రండి పెట్టుబడుల పెట్టండి.. పారిశ్రామికవేత్తలను ఆహ్వానించిన సీఎం జగన్‌..

|

May 24, 2022 | 8:39 PM

వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరంలో డీకార్బనైజ్డ్‌ మెకానిజంపై జరిగిన సదస్సులో ప్రసంగించారు ముఖ్యమంత్రి జగన్‌(YS Jagan Mohan Reddy). ఇటీవల కర్నూలు(Kurnool)లో ప్రారంభించిన ఇంటిగ్రేటెడ్‌ పంప్డ్‌ స్టోరేజ్‌ రెన్యువబుల్‌ ప్రాజెక్ట్‌ గురించి వివరించారు...

CM Jagan: రండి పెట్టుబడుల పెట్టండి.. పారిశ్రామికవేత్తలను ఆహ్వానించిన సీఎం జగన్‌..
Jagan
Follow us on

వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరంలో డీకార్బనైజ్డ్‌ మెకానిజంపై జరిగిన సదస్సులో ప్రసంగించారు ముఖ్యమంత్రి జగన్‌(YS Jagan Mohan Reddy). ఇటీవల కర్నూలు(Kurnool)లో ప్రారంభించిన ఇంటిగ్రేటెడ్‌ పంప్డ్‌ స్టోరేజ్‌ రెన్యువబుల్‌ ప్రాజెక్ట్‌ గురించి వివరించారు. ఈ కర్బన రహిత పవర్‌ ప్రాజెక్టు ద్వారా విండ్‌, హైడల్‌, సోలార్‌ విద్యుత్‌ను నిరంతరాయంగా ఉత్పత్తి చేయవచ్చని వివరించారు. తక్కువ ఖర్చుతో కాలుష్యం లేకుండా సుస్థిరమైన విద్యుత్‌(power)ను సాధించవచ్చని చెప్పారు. ప్రపంచంలోనే అతి పెద్ద కర్బన రహిత పవర్‌ ప్రాజెక్టు పనులు కర్నూలులో మొదలయ్యాయని, కొన్ని రోజుల్లోనే ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తుందన్నారు. గ్రీన్‌ ఎనర్జీ ప్రొడక‌్షన్‌లో కర్నూలు ప్రాజెక్టు షోకేస్‌గా నిలుస్తుందన్నారు. కేవలం పంప్డ్‌ స్టోరేజీ ద్వారానే 1650 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం అత్యంత గొప్ప విషయమని జగన్‌ వివరించారు. దీంట్లో భాగస్వాములయ్యేందుకు పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించారు.

ఏపీ అమలు చేస్తోన్న కర్బన రహిత పారిశ్రామిక విధానంపై నీతి అయోగ్‌ సీఈవో అమితాబ్‌కాంత్‌ ప్రశంసలు కురిపించారు. కర్బణ రహిత పవర్‌ ఉత్పత్తికి ఇండియాలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, వాటిని ఏపీ ఒడిసిపట్టుకుందని ప్రశంసించారు. ఏపీ అమలు చేస్తున్న టెక్నాలజీని, ప్రపంచం అంతా అనుసరించాలన్నారు. గ్రీన్‌ ఎనర్జీ కోసం ఏపీ సీఎం అమలు చేస్తున్న పాలసీ బాగుందని కొనియాడారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించినట్లు ఆదిత్య మిట్టల్‌ చెప్పారు. స్టీల్‌ ఉత్పత్తి సెక్టార్‌ నుంచి 8 శాతం కార్బన్‌ విడుదల అవుతోందని, కానీ ఏపీలో ఉత్పత్తి చేయబోతున్న హైడ్రోజన్‌ను స్టీలు పరిశ్రమలో ఉపయోగించడం ద్వారా, స్టీల్‌ సెక్టార్‌లో కర్బన్‌ ఉద్గారాలను గణనీయంగా తగ్గిస్తామన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి..