CM Jagan: ఎంఎస్‌ఎంఈ, స్పిన్నింగ్‌ సహా పలు రంగాలకు జగన్ సర్కారు ఊతం.. నేడే బటన్ నొక్కి నిధులు విడుదల

|

Sep 03, 2021 | 8:15 AM

ఆంధ్రప్రదేశ్ లోని ఎంఎస్‌ఎంఈలు, టెక్స్‌టైల్, స్పిన్నింగ్‌ మిల్స్‌కు ఊతమిస్తూ రూ.1,124 కోట్ల ప్రోత్సాహకాలు ఇవాళ విడుదల

CM Jagan: ఎంఎస్‌ఎంఈ, స్పిన్నింగ్‌ సహా పలు రంగాలకు జగన్ సర్కారు ఊతం.. నేడే బటన్ నొక్కి నిధులు విడుదల
CM YS Jagan
Follow us on

AP: ఆంధ్రప్రదేశ్ లోని ఎంఎస్‌ఎంఈలు, టెక్స్‌టైల్, స్పిన్నింగ్‌ మిల్స్‌కు ఊతమిస్తూ రూ.1,124 కోట్ల ప్రోత్సాహకాలు ఇవాళ విడుదల చేయబోతోంది జగన్ సర్కారు. నేడు అమరావతిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు బటన్‌ నొక్కి విడుదల చేయనున్నారు సీఎం జగన్‌. ఎంఎస్‌ఎంఈలకు రూ. 440 కోట్లు, టెక్స్‌టైల్, స్పిన్నింగ్‌ మిల్స్‌కు రూ. 684 కోట్లు రిలీజ్ చేస్తారు. పారిశ్రామికాభివృద్దికి వెన్నెముకగా నిలుస్తూ రాష్ట్రంలో దాదాపు 12 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న ఎంఎస్‌ఎంఈలు, టెక్స్‌టైల్, స్పిన్నింగ్‌ మిల్స్‌కు ఊతమిస్తూ ఈ ప్రోత్సాహకాలు విడుదల చేయనుంది జగన్ ప్రభుత్వం.

కాగా, ఇప్పటి వరకు ఈ రంగాలకు జగనన్న ప్రభుత్వం అందించిన మొత్తం ప్రోత్సాహకాలు రూ.2,086.42 కోట్లుగా ఉన్నాయి. గత ప్రభుత్వం బకాయిపెట్టిన రూ.1,588 కోట్లు సైతం ఇవాళ చెల్లింపులు జరపాలని నిర్ణయించారు. ప్రోత్సాహకాలు పొందుతున్న యూనిట్లలో 62% ఎస్సీ, ఎస్టీ, బీసీలవే నని ప్రభుత్వం చెబుతోంది. ఈ చర్య వల్ల మొత్తంగా ఎంఎస్ఎంఈలపై ఆధారపడిన 12 లక్షల మందికి భరోసా కలుగుతుందని వైసీపీ ప్రభుత్వం చెబుతోంది.

ఇలాఉండగా, ఆస్పత్రుల్లో వైద్య సేవలపై ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్యం అందించాలని, ప్రభుత్వాస్పత్రికి వెళ్తే రోగం తగ్గుతుందనే భరోసా ప్రజలకు రావాలని ముఖ్యమంత్రి అన్నారు.

కొవిడ్‌ నివారణ చర్యలపై నిర్వహించిన సమీక్షలో సీఎం వైయస్‌ జగన్‌ ఈ మేరకు ఆదేశాలిచ్చారు. డబ్ల్యూహెచ్‌ఓ, జీఎంపీ ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన మందులు అందించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ కొనసాగుతుందని, రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమల్లో ఉంటాయని సీఎం వైయస్‌ జగన్‌ చెప్పారు.

Read also:  Pralhad Joshi Dance: స్టేజ్ మీద స్టెప్పులేసి ఊదరగొట్టిన కేంద్రమంత్రి