Chandrababu Naidu AP CM Swearing in Ceremony Updates: ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ప్రమాణం చేశారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబుతో ప్రమాణం చేయించారు. అనంతరం పవన్ కల్యాణ్, నారా లోకేష్ ప్రమాణం చేశారు. ఆతర్వాత మిగతా మంత్రులతో గవర్నర్ ప్రమాణం చేయించారు. గన్నవరం ఎయిర్‌పోర్టు సమీపంలో ఉన్న కేసరపల్లిలోని ఐటీ పార్క్‌లో ఈ ప్రమాణస్వీకార మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఎన్డీఏ నేతలు, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. వీవీఐపీలు, వీఐపీలతోపాటు నేతలు, ప్రజల కోసం 36 గ్యాలరీలు సిద్ధం చేశారు. అలాగే 7 వేల మంది పోలీసులతో భారీభద్రతను కూడా ఏర్పాటు చేశారు.
చంద్రబాబు ప్రమాణస్వీకారం నేపథ్యంలో బెజవాడ నుంచి కేసరపల్లి వరకు 3 పార్టీల జెండాలను ఏర్పాటు చేశారు. 14 ఎకరాల్లో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతోంది. 11.5 ఎకరాల్లో సభా ప్రాంగణం.. 2.5 ఎకరాల్లో సభా వేదిక ఏర్పాటు చేశారు. దాదాపు రెండు లక్షల మంది కూర్చుని ప్రమాణ స్వీకారాన్ని తిలకించేలా ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా ప్రమాణ స్వీకారాన్ని వీక్షించేందుకు.. విజయవాడలో పలుచోట్ల LED స్క్రీన్లు సైతం ఏర్పాట్లు చేశారు.
ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి వైపు నడిపిస్తామన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. అందరం అంకితభావంతో పనిచేస్తామన్నారు. శాసనసభలో పరస్పరం గౌరవించే సంస్కృతిని తీసుకొస్తామన్నారు నాదెండ్ల.
మెగా బ్రదర్స్‌తో ప్రధాని మోడీ సందడి చేశారు. ప్రమాణస్వీకారం తర్వాత చిరంజీవి, పవన్ కల్యాణ్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన మోడీ.. చిరంజీవి, పవన్ చేతులు పట్టుకొని ప్రజలకు అభివాదం చేశారు.
ప్రమాణ స్వీకారం అనంతరం ప్రధాని మోదీ తిరిగి బయలు దేరారు. ఏపీ పర్యటన అనంతరం మోదీ ఒడిశా వెళ్లనున్నారు.
ప్రమాణ స్వీకారం అనంతరం అనంతరం ప్రధాని మోదీ చిరంజీవి, రజినీకాంత్, బాలకృష్ణ, గవర్నర్ దంపతులను ఆప్యాయంగా పలకరించారు.
సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు ప్రమాణ స్వీకారం అనంతరం ప్రధాని మోదీని చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ సన్మానించారు. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్ తో మోదీ ఆప్యాయంగా మాట్లాడారు.
మండిపల్లి రామ్‌ప్రసాద్ రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ నజీర్ ప్రమాణం చేయించారు.
కొండపల్లి శ్రీనివాస్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ నజీర్ ప్రమాణం చేయించారు.
వాసంశెట్టి సుభాష్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ నజీర్ ప్రమాణం చేయించారు.
ఎస్. సవిత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ నజీర్ ప్రమాణం చేయించారు.
టీజీ భరత్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ నజీర్ ప్రమాణం చేయించారు.
బీసీ జానార్థన్ రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ నజీర్ ప్రమాణం చేయించారు.
గుమ్మడి సంధ్యారాణి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ నజీర్ ప్రమాణం చేయించారు.
కందుల దుర్గేష్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ నజీర్ ఆయనతో ప్రమాణం చేయించారు.
చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నుంచి అతిరథ మహారథులు తరలివచ్చారు. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం, కేంద్ర మంత్రులు చిరాక్ పాశ్వాన్, అనుప్రియ పటేల్, అథవాలేతో పాటు ఎన్డీఏ పక్ష నేత ప్రఫుల్ పటేల్ హాజరయ్యారు. బీజేపీకి చెందిన అగ్రనేతలంతా కేసరపల్లిలో ల్యాండ్ అయ్యారు. ప్రధాని మోదీ, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్‌షా, గడ్కరీ, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక తెలుగు రాష్ట్రాలకు చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, బండి సంజయ్ సహా ప్రముఖులంతా చంద్రబాబు ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు.
గొట్టిపాటి రవికుమార్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ నజీర్ ప్రమాణం చేయించారు.
బాలవీరాంజనేయస్వామి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ నజీర్ ప్రమాణం చేయించారు.
కొలుసు పార్థసారిధి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ నజీర్ ప్రమాణం చేయించారు.
అనగాని సత్యప్రసాద్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ నజీర్ ప్రమాణం చేయించారు.
పయ్యావుల కేశవ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ నజీర్ ప్రమాణం చేయించారు.
ఆనం రామనారాయణ రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ నజీర్ ప్రమాణం చేయించారు.
మహ్మద్ ఫరూక్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ నజీర్ ప్రమాణం చేయించారు.
నిమ్మల రామానాయుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ నజీర్ ప్రమాణం చేయించారు.
సత్యకుమార్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ నజీర్ ప్రమాణం చేయించారు.
వంగలపూడి అనిత మంత్రిగా ప్రమాణం చేశారు. గవర్నర్ నజీర్ ప్రమాణం చేయించారు.
పొంగురు నారాయణ మంత్రిగా ప్రమాణం చేశారు.
నాదేండ్ల మనోహర్ మంత్రిగా ప్రమాణం చేశారు.
కొల్లు రవీంద్ర మంత్రిగా ప్రమాణం చేశారు.
కింజారపు అచ్చెన్నాయుడు మంత్రిగా ప్రమాణం చేశారు.
చంద్రబాబు, పవన్ కల్యాణ్ అనంతరం నారా లోకేష్ ప్రమాణం చేశారు.
చంద్రబాబు అనంతరం కొణిదెల పవన్ కల్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌కు నాలుగోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు.
చంద్రబాబు, ప్రధానిమోదీ ఇద్దరూ వేదికపైకి చేరుకున్నారు. కాపేపట్లోనే చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేయనున్నారు.
గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధాని మోదీకి చంద్రబాబు స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరూ ఒకే కాన్వాయ్ లో కేసరపల్లికి చేరుకున్నారు. మరికాసేపట్లో చంద్రబాబు ప్రమాణం చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు నాలుగోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, చిరాగ్ పాశ్వాన్ తదితర ప్రముఖులు హాజరయ్యారు.
చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం సందర్భంగా పిఠాపురంలో ప్రత్యేక ఎల్సీడీలను ఏర్పాటు చేసి లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేసి స్థానిక ప్రజలు వీక్షిస్తున్నారు.
గన్నవరం ఎయిర్‌పోర్టుకు ప్రధాని మోదీ చేరుకున్నారు. ప్రధాని మోదీకి చంద్రబాబు స్వాగతం పలికారు. కాసేపట్లో ఇద్దరూ కేసరపల్లికి చేరుకోనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు నాలుగోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం చేయనున్నారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీకాంత్ దంపతులు, కేంద్రమంత్రులు హాజరయ్యారు.
చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి జనం పోటెత్తుతున్నారు.. దీంతో దాదాపుగా 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవానికి రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు పెద్దఎత్తున హాజరవుతున్నారు.
ఈ కారణంగా గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో జాతీయ రహదారిపై టోల్‌గేట్ వద్ద రాయలసీమ నుంచి వస్తున్న వాహనాలతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మెగా కుటుంబ సభ్యులు మొత్తం ప్రత్యేక బస్సుల్లో గన్నవరం బయలుదేరారు. ఇప్పటికే చిరంజీవి విజయవాడకు చేరుకున్న విషయం తెలిసిందే..
చంద్రబాబు ప్రమాణస్వీకారానికి పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు హాజరవుతున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి తెలంగాణ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హాజరయ్యారు.
చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ, బీజేపీ, జనసేన అభిమానులు తరలివస్తున్నారు. కేసరపల్లి సభా ప్రాంగణం అభిమాన సందోహంతో కిటకిటలాడుతోంది. తరలివస్తున్న కూటమి కార్యకర్తలతో ఇప్పటికీ బెజవాడలో ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది.
సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం నేపథ్యంలో కృష్ణా జిల్లా పరిధిలో ట్రాఫిక్ మల్లింపు ..
ట్రాఫిక్ మళ్లింపు మార్గాలు…
⏩ విశాఖ పట్నం నుండి చెన్నై వైపు వెళ్లే వాహనాలను
1 .కత్తిపూడి నుండి జాతీయ రహదారి 216 మీదుగా ఒంగోలు వైపు.
2 . విశాఖపట్నం నుండి చెన్నై వెళ్లి వచ్చే వాహనాలను కత్తిపూడి నుండి ఒంగోలు వైపు మళ్లించడం జరిగింది.
⏩ చెన్నై నుండి విశాఖపట్నం వైపు వచ్చు వాహనాలు
1 .ఒంగోలు నుండి రేపల్లె మీదుగా వయ మచిలీపట్నం – లోసర్ బ్రిడ్జి – నరసాపురం – అమలాపురం – కాకినాడ – కత్తిపూడి మీదుగా విశాఖపట్నం వైపు మరలించడం జరిగింది.
2 . బుడంపాడు నుండి తెనాలి – పులిగడ్డ – మచిలీపట్నం – లోసర్ బ్రిడ్జి – నర్సాపురం – కాకినాడ – కత్తిపూడి వైపు మళ్లింపు.
⏩️ _విశాఖపట్నం నుండి హైదరాబాద్ వెళ్ళే వాహనాలను_
1 . గామన బ్రిడ్జి – దేవరపల్లి – జంగారెడ్డిగూడెం – అశ్వరావుపేట – ఖమ్మం మీదుగా హైదరాబాద్
2 . భీమడోలు – ద్వారకాతిరుమల – కామవరపుకోట – చింతలపూడి నుండి ఖమ్మం వైపు
3 . ఏలూరు బైపాస్ నుండి – జంగారెడ్డిగూడెం మీదుగా అశ్వరావుపేట – ఖమ్మం మీదుగా హైదరాబాద్ వైపు.
4 . ఏలూరు బైపాస్ – చింతలపూడి నుండి సత్తుపల్లి మీదుగా.
5 . హనుమాన్ జంక్షన్ – నూజివీడు, మైలవరం – ఇబ్రహీంపట్నం – నందిగామ మీదుగా హైదరాబాద్ వైపు మళ్లింపు
⏩️ హైదరాబాద్ నుండి విశాఖపట్నం వచ్చు వాహనాలను
1 . నందిగామ – మధిర – వైరా – సత్తుపల్లి – అశ్వరావుపేట – జంగారెడ్డిగూడెం – దేవరపల్లి – గామన బ్రిడ్జి మీదుగా విశాఖపట్నం వైపు
2 . ఇబ్రహీంపట్నం – మైలవరం – నూజివీడు – హనుమాన్ జంక్షన్ నుండి ఏలూరు బైపాస్ మీదుగా విశాఖపట్నం వైపు.
3 . రామవరప్పాడు – నున్న – పాముల కాలువ – వెలగలేరు – జి.కొండూరు – మైలవరం – నూజివీడు – హనుమాన్ జంక్షన్ – ఏలూరు బైపాస్ మీదుగా విశాఖపట్నం వైపు.
4 . విజయవాడ నుండి ఎనికేపాడు మీదుగా 100 అడుగుల రోడ్డు – తాడిగడప – కంకిపాడు – పామర్రు – గుడివాడ నుండి భీమవరం వైపు
చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ప్రధాని మోదీ హాజరుకానున్నారు. 8:20 కు ఢిల్లీ నుండి బయలుదేరారు. 10:40 కు గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్నారు. ఆయనకు చంద్రబాబు స్వాగతం పలుకుతారు.
గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి సభ ప్రాంగణానికి మోదీ రానున్నారు.
10:55 కు సభ ప్రాంగణానికి చేరుకుంటారు.
గంటన్నర పాటు చంద్రబాబు ప్రమాణస్వీకారంలో ఉండనున్నారు.
12:45 కు గన్నవరం విమానాశ్రయం నుండి భువనేశ్వర్ కు వెళతారు.
చంద్రబాబు ప్రమాణస్వీకారానికి పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, వెంకయ్యనాయుడు, మాజీ సీజేఐ ఎన్వీ రమణ, కేంద్రమంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, కిషన్ రెడ్డి, బండి సంజయ్, చిరాగ్ పాశ్వాన్, నితిన్ గడ్కరీ, జితిన్ మాంఝి, జయంత్ చౌదరి, అనుప్రియ పటేల్, రాందాస్ అథవాలే, ప్రఫుల్ పటేల్, మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం, మాజీ గవర్నర్ తమిళిసై, సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి తదితరులు హాజరుకానున్నారు.
ప్రముఖుల రాకతో గన్నవరం ఎయిర్ పోర్ట్ దగ్గర ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉ.10 నుంచి సా.4 గంటల వరకు ఎయిర్ పోర్ట్ పరిసరాల్లో ఆంక్షలు విధించారు.