CM YS Jagan: సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ఖరారు.. ప్రధాని మోదీ సహా కేంద్రమంత్రులో భేటీ..!

| Edited By: Rajeev Rayala

Jul 04, 2023 | 7:54 AM

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారైంది. ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్లే జగన్‌, మూడు రోజులపాటు అక్కడే ఉంటారని సమాచారం. ఈ నెల 5వ తేదీన ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ అవుతారు. ఈ భేటీ సందర్భంగా రాష్ట్ర సమస్యలపై ప్రధానితో సీఎం చర్చించనున్నారు.

CM YS Jagan: సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ఖరారు.. ప్రధాని మోదీ సహా కేంద్రమంత్రులో భేటీ..!
CM Jagan
Follow us on

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారైంది. ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్లే జగన్‌, మూడు రోజులపాటు అక్కడే ఉంటారని సమాచారం. ఈ నెల 5వ తేదీన ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ అవుతారు. ఈ భేటీ సందర్భంగా రాష్ట్ర సమస్యలపై ప్రధానితో సీఎం చర్చించనున్నారు. ఇందుకు సంబంధించి వినతి పత్రాన్ని ప్రధానికి అందజేయనున్నారు. ఆ తర్వాత హోంమంత్రి అమిత్‌షా, ఇతర కేంద్రమంత్రుల్ని కలవనున్నారు. ఇప్పటికే జగన్ తన ఢిల్లీ టూర్‌లో చర్చించాల్సిన అంశాలపై కసరత్తు చేసినట్లు తెలుస్తోంది.

అలాగే ప్రధాని మోదీ సైతం కొన్ని అంశాల్లో సీఎం జగన్‌ సపోర్ట్ కోరే అవకాశం కనిపిస్తోంది. త్వరలో జరిగే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న బిల్లులకు మద్దతు కోరనున్నారు. ప్రధానంగా ఢిల్లీలో పాలనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లు, ఉమ్మడి పౌరస్మృతి సహా ఇతర బిల్లులు కూడా ఉన్నాయి. పార్లమెంటులో ముఖ్యంగా రాజ్యసభలో వైసీపీ మద్ధతు కేంద్రానికి అనివార్యం. ఈ నేపథ్యంలోనే బిల్లుల ఆమోదం కోసం వైసీపీ మద్ధతును కోరనున్నారు ప్రధాని మోదీ.

జూలై 6న హోమంత్రి అమిత్‌షా, ఇతర మంత్రులతో భేటీ..

ఇక జూలై 6వ తేదీన ఉదయం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ కాబోతున్నారు. అమిత్ షా‌తో కూడా రాష్ట్ర విభజన హామీల అమలు సహా ఇతర సమస్యల పరిష్కారం కోసం వినతిపత్రాలు అందజేయనున్నారు. ప్రధాని మూడు రాజధానులు, పోలవరం ప్రాజెక్టు సహా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై అమిత్‌ పాటు ఇతర మంత్రులను కోరనున్నారు సీఎం జగన్. మొత్తానికి సీఎం జగన్‌ తన హస్తిన పర్యటనలో బిజీ బిజీగా ఉండబోతున్నారు.