AP News: స్కూటీని చూసి భావోద్వేగం.. సీఎం చంద్రబాబునే కదిలించిన మహిళ..

ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోరీకి గురైన ఓ మహిళ స్కూటీని పోలీసులు రికవరీ చేశారు. దీంతో ఆ బైక్‌ను చూసి మహిళ భావోద్వేగానికి గురైంది. తాజాగా దీనిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు.

AP News: స్కూటీని చూసి భావోద్వేగం.. సీఎం చంద్రబాబునే కదిలించిన మహిళ..
Andhra Pradesh Cm Chandrababu
Follow us
B Ravi Kumar

| Edited By: Velpula Bharath Rao

Updated on: Nov 08, 2024 | 9:39 PM

ఏలూరికి చెందిన నీల అలివేణికి చెందిన స్కూటీ కొన్ని రోజుల క్రితం చోరీకి గురైంది. దాంతో ఆమె తన స్కూటీ దొంగతనం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. స్కూటీ లేకపోవటంతో అలివేణి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. తల సేమియా వ్యాధితో బాధపడుతున్న తన కుమార్తెను ఆస్పత్రికి ఆ స్కూటీ మీదే తీసుకువెళ్లేది. అయితే స్కూటీ చోరీకి గురవడంతో తన కుమార్తెను ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు నానా ఇబ్బందులు ఎదుర్కొంది. దాంతో స్కూటీ ఎప్పుడు దొరుకుతుందా అని వేయి కళ్ళతో ఎదురు చూడటం మొదలుపెట్టింది. తాజాగా ఏలూరు పోలీసులు వరుస బైక్ చోరీలకు పాల్పడుతున్న దొంగలను పట్టుకుని వారు దోచుకెళ్లిన బైకులను రికవరీ చేశారు. అందులో అలివేణి స్కూటీ కూడా ఉంది. పోలీసులు అలివేణిని పిలిచి తన స్కూటీ దొరికిందని స్టేషన్‌కు వచ్చి తీసుకు వెళ్ళమని చెప్పడంతో తన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

హుటాహుటిన పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అలివేణి నేరుగా తను పోగొట్టుకున్న స్కూటీ వద్దకు వెళ్లి దానిని ప్రేమగా హత్తుకుని కంటతడి పెట్టి భావోద్వేగానికి గురైంది. అయితే ఇదే విషయాన్ని ఏపీ పోలీసులు సైతం సోషల్ మీడియా సైట్లో పోస్ట్ చేయడంతో అది తెలుసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు వెంటనే పోలీసులను అభినందిస్తూ ట్విట్ చేశారు. ఆ మహిళకు స్కూటీ అందజేసిన పోలీసులను ప్రత్యేకంగా అభినందించారు. అంతేకాక బాధిత మహిళ నీల అలివేణి భావోద్వేగం చెందడం తనను కదిలించిందని, స్కూటర్ ఆమెకు ఎంత ముఖ్యమో చూస్తే వారి పరిస్థితి అర్ధం అవుతుందన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!