Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ పదవీ కాలాన్ని మరో 6 నెలల పాటు పొడిగించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజా నిర్ణయంతో మరో 6 నెలల పాటు సమీర్ శర్మ రాష్ట్ర సీఎస్ గా కొనసాగనున్నారు. వాస్తవానికి సమీర్ శర్మ పదవీ కాలంలో నవంబర్ 30, 2021 తోనే ముగియాల్సి ఉండగా.. అప్పుడు ఆయన పదవీ కాలాన్ని 6 నెలల పాటు పొడిగించారు. దీని ప్రకారం.. 31 మే, 2022 న ఆయన పదవీ విరమణ పొందాల్సి ఉంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఆయన పదవీ కాలాన్ని పొడిగించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. సీఎస్ సమీర్ శర్మ పదవీ కాలాన్ని మరో 6 నెలలు, అంటే నవంబర్ 30వ తేదీ వరకు పొడిగించింది. ఈ మేరకు డీవోపీటీ ఉత్తర్వులు విడుదల చేసింది.