Polavaram Project: కేంద్ర ప్రభుత్వం నుంచి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి బిల్లుల చెల్లింపుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంబంధిత శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశానికి ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్, పోలవరం ప్రాజెక్టు అధికారులు హాజరయ్యారు. దాదాపు రూ. 1600 కోట్ల బిల్లులు వేర్వేరు దశల్లో పెండింగ్‌లో ఉన్నాయని సీఎం జగన్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేసిన ఖర్చుకు సంబంధించి కేంద్రంలో బిల్లులు పెండింగులో ఉండడం సరికాదన్నారు సీఎం జగన్. అధికారులు వెంటనే దీనిపై దృష్టిపెట్టాలని దిశానిర్దేశం చేశారు. చేసిన ఖర్చు వెంటనే రీయింబర్స్ అయ్యేలా చూడాలాని ఆదేశించారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా వచ్చే మూడు నెలల కాలానికి కనీసం రూ. 1400 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు చెబుతున్నారని ఉటంకించిన సీఎం జగన్.. వెంటనే ఢిల్లీకి వెళ్లి పెండింగ్‌లో ఉన్న బిల్లులు క్లియర్ అయ్యేలా చూడాలని ఆదేశించారు. కాగా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గట్టి సంకల్పంతో ఉన్న విషయం తెలిసిందే. 2022 చివరి నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు.. ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్న మెఘా సంస్థ కూడా ప్రాజెక్టు నిర్మాణ పనులను ఊహించని స్పీడ్‌తో చేస్తోంది. ప్రభుత్వం నిర్ధేశించిన గడువులోగా ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది.
Also read:
Corona Spread: కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ మధ్య వ్యత్యాసాలు.. ఐసీఎంఆర్ నివేదిక ఆసక్తికర అంశాలు..