Andhra Pradesh: కేసులు తగ్గినా అప్రమత్తంగా ఉండాల్సిందే.. అధికారులకు కీలక ఆదేశాలిచ్చిన సీఎం జగన్..

|

Aug 25, 2021 | 6:19 PM

Amaravathi: కోవిడ్‌ గణాంకాలు, అంకెలతో సంబంధం లేకుండా ఈ మహమ్మారి పట్ల నిత్యం అప్రమత్తంగా ఉండాలి అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు.

Andhra Pradesh: కేసులు తగ్గినా అప్రమత్తంగా ఉండాల్సిందే.. అధికారులకు కీలక ఆదేశాలిచ్చిన సీఎం జగన్..
Cm Jagan
Follow us on

Amaravathi: కోవిడ్‌ గణాంకాలు, అంకెలతో సంబంధం లేకుండా ఈ మహమ్మారి పట్ల నిత్యం అప్రమత్తంగా ఉండాలి అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. కరోనా వ్యాప్తిపై నిరంతరం పర్యవేక్షణ, సమీక్ష చేయాలన్నారు. కోవిడ్‌తో సహజీవనం చేయాల్సిన పరిస్థితి ఉందని, అయితే జాగ్రత్త వహిస్తే ప్రమాదం ఉండదని చెప్పారు. బుధవారం నాడు స్పందనపై ముఖ్యమంత్రి జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. కరోనా కేసులు సగటున 13,00 లకు పడిపోయినప్పటికీ.. జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలన్నారు. రివకరీ రేటు 98.63 శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 2.07శాతం ఉన్నప్పటికీ అప్రమత్తంగానే ఉండాలని దిశానిర్దేశం చేశారు. ప్రజలు తప్పకుండా కోవిడ్‌ మార్గదర్శకాలను పాటించేలా చూడాలని, మార్గదర్శాలను పాటించకపోతే కఠినంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు సీఎం జగన్. పెళ్లిళ్లలో 150కి మించి ఉండకుండా చూడాలన్నారు.

రాష్ట్రంలో స్కూళ్లు ప్రారంభం అయ్యాయని, ద్యాసంస్థల్లో పాటించాల్సిన ఎస్‌ఓపీలను విడుదలచేశామని సీఎం పేర్కొన్నారు. ఈ నిబంధనలను తప్పకుండా పాటించేలా చూడాలన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా టెస్టింగ్ విషయంలో కాంప్రమైజ్ అవ్వొద్దని సూచించారు. ఫోకస్‌గా టెస్టింగ్ నిర్వహించాలని, ఇంటింటికీ సర్వేలు కొనసాగాలన్నారు. ఎవరికి లక్షణాలు ఉన్నా వెంటనే పరీక్షలు జరిపించాలన్నారు. విద్యా సంస్థల్లో ఎవరికైనా లక్షణాలు ఉన్నాయని టీచర్‌ చెప్తే.. మార్గదర్శకాల ప్రకారం వెంటనే అక్కడ పరీక్షలు నిర్వహించాలన్నారు. 104 అనే నెంబర్ వన్ స్టాప్ సొల్యూషన్ కావాలని పేర్కొన్నారు. సమర్థవంతంగా పనిచేసి కోవిడ్‌ నియంత్రణను అడ్డుకోవాలన్నారు. నిరంతర పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్దేశించుకకున్న ఎస్‌ఓపీలను పాటించాలని సూచించారు.

థర్డ్‌ వేవ్‌వస్తుందో, లేదో తెలియగానే సన్నద్ధంగా ఉండాలని అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఆస్పత్రులను, సిబ్బందిని సన్నద్ధంగా ఉంచుకోవాలన్నారు. నర్సులకు శిక్షణ కూడా ఇవ్వాలన్నారు. అందుబాటులో బెడ్లను, ఆస్పత్రులను ఉంచుకోవాలన్నారు. ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలో పీఎస్‌ఏ ప్లాంట్లు అందుబాటులోకి వస్తున్నాయని చెప్పారు. ఆక్సిజన్‌ సిలెండర్లు, కాన్‌సంట్రేటర్లు అందుబాటులో ఉంచుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. 100 బెడ్లు దాటిన ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా పీఎస్‌ఏ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇప్పటివరకూ 71,03,996 మందికి డబుల్‌ డోస్, 1,18,53,028 మందికి సింగిల్‌డోస్‌ వ్యాక్సిన్లు ఇచ్చామని, 85శాతం ప్రజలకు డబుల్‌ డోస్‌ ఇచ్చేంత వరకూ కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు.

ప్రస్తుతం 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉన్నవారికి వ్యాక్సిన్లపై దృష్టి సారించాలన్నారు. సచివాలయాన్ని యూనిట్‌గా పెట్టుకుని ప్రతి ఇంట్లో ఉన్నవారికి కూడా వ్యాక్సిన్లు పూర్తిచేసేలా ముందడుగు వేయాలన్నారు. దీనివల్ల వ్యాక్సిన్ల వృథాను అరికట్టగలుగుతామని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. కరోనా పరిస్థితి ఇలా ఉంటే.. సీజనల్‌ వ్యాధులపైనా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాకాల సమావేశాల్లో వచ్చే వ్యాధులపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. మలేరియా, టైఫాయిడ్, డెంగీ, చికెన్‌గున్యా తదితర వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు.

Also read:

Vijayashanthi: ఎన్నికల కోసమే ప్రజలకు తాయిలాలు.. హుజురాబాద్‌ ఉప ఎన్నికలో బీజేపీ గెలుపు ఖాయంః విజయశాంతి

Andhra Pradesh: గృహ నిర్మాణాలపై సీఎం జగన్ సమీక్ష.. వారికి ఇళ్ల పట్టాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశం..

తరుముకొస్తున్నథర్డ్ వేవ్..! హెచ్చరిస్తున్నా కేంద్ర ఆరోగ్య శాఖ..: Third Wave Of Coronavirus Live Video.