AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఢిల్లీలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి.. జనసేనతో ప్రయాణంపై క్లారిటీ !

పొత్తు అనేది అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదనీ.. బీజేపీ దృష్టికి ఎప్పుడో ఈ విషయాన్ని తీసుకెళ్లా అంటున్నారు జనసేన అధినేత పవన్‌కల్యాణ్. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటున్నారు. వైసీపీని ఓడించడమే తన టార్గెట్ అనీ.. దాని కోసం ఏమైనా చేస్తా అని అంటున్నారాయన. బీజేపీ నేతలు G20 కార్యక్రమాల్లో బిజీగా ఉండడం వల్ల తానే లీడ్ తీసుకున్నట్లు చెప్పారు.

ఢిల్లీలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి.. జనసేనతో ప్రయాణంపై క్లారిటీ !
Daggubati Purandeswari
Ram Naramaneni
|

Updated on: Oct 08, 2023 | 5:54 PM

Share

ఏపీలో పొత్తులపై గమ్మత్తు రాజకీయం నడుస్తోంది. పవన్ చూస్తే టీడీపీతో కలిసి ముందుకు వెళ్తున్నారు. జాయింట్ కమిటీ ఏర్పాటు చేసి.. కార్యాచరణ ప్రకటిస్తున్నారు. కానీ మిత్రపక్షమైన బీజేపీని మాత్రం పట్టించుకోవడం లేదు. ఒకసారి బీజేపీతోనే ఉన్నా అంటారు. ఇంకోసారి టీడీపీ, జనసేనతో కలిసి.. బీజేపీ కలిసి వస్తుందని ఆశిస్తున్నా అంటారు. కానీ బీజేపీ, టీడీపీకి రాజకీయ లింక్ లేదు. పవన్ మాత్రం బీజేపీతో ఉంటూనే సైకిల్‌తో ప్రయాణిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఏపీలో ఏయే పార్టీల మధ్య పొత్తు ఉంది. ఏయే పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్తాయనేది పెద్ద కన్ఫ్యూజన్.

ముఖ్యంగా పవన్ పొలిటికల్ యాక్షన్‌తో రాష్ట్ర బీజేపీ నేతలు ఆయోమయంలో పడ్డారు. అందుకే పొత్తులపై ఇక తేలాల్సిందే.. లెక్క తేలాల్సిందే.. అంటోంది కమలం పార్టీ. దీనిపై క్లారిటీ తీసుకునేందుకు ఢిల్లీ బాట పట్టారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పురందేశ్వరి. కొద్ది రోజుల క్రితమే కోర్ కమిటీ సమావేశాన్ని నిర్వహించిన రాష్ట్ర బీజేపీ.. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలతో పాటు జనసేన వైఖరిని అధిష్టానం ముందుకి తీసుకెళ్లారు. దీనిపై బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. ఏపీలో రాజకీయ ముఖచిత్రం ఎలా మారబోతుందనేది ఆసక్తిగా మారింది. అయితే ఎన్డీయే కూటమిలో ఉండగా టీడీపీతో జతకట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది. బీజేపీతో చర్చించే పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారా.. లేక ఇది జనసేన నిర్ణయమా అనే దానిపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.

పొత్తు అనేది అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదనీ.. బీజేపీ దృష్టికి ఎప్పుడో ఈ విషయాన్ని తీసుకెళ్లా అంటున్నారు జనసేన అధినేత పవన్‌కల్యాణ్. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటున్నారు. వైసీపీని ఓడించడమే తన టార్గెట్ అనీ.. దాని కోసం ఏమైనా చేస్తా అని అంటున్నారాయన. బీజేపీ నేతలు G20 కార్యక్రమాల్లో బిజీగా ఉండడం వల్ల తానే లీడ్ తీసుకున్నట్లు చెప్పారు. పైగా తమతో బీజేపీ కలిసి వస్తుందనే ఆశాభావం కూడా ఉందంటున్నారు. అయితే కమలం పార్టీ రాష్ట్ర నేతలు మాత్రం ఈ విషయంలో అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అంటున్నారు. పవన్ తన అభిప్రాయం తాను చెప్పారు. కానీ ఢిల్లీ నుంచి వచ్చే ఆదేశాల ప్రకారమే తాము ముందుకు వెళ్తామంటున్నారు.

టీడీపీ, జనసేనతోపాటు లెఫ్ట్‌ పార్టీలు కూడా కలిసి ఉమ్మడి ఉద్యమాలు చేపట్టాయి.. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఆందోళనల్లో పాల్గొంటున్నారు 3 పార్టీల నేతలు. లెఫ్ట్‌ నేతలు కూడా జనసేనతో కలిసిన పరిస్థితుల్లో ఈ కూటమిలో BJP ఉంటుందా.. లేదా.. ఏం జరుగుతుంది అనేది ఉత్కంఠ రేపుతోంది.. వీటిపై చర్చించేందుకే పురంధేశ్వరి ఢిల్లీ వెళ్లారు. ప్రస్తుతానికి పవన్‌ టెక్నికల్‌గా NDAలో ఉన్నా.. లోకల్‌గా టీడీపీతో కలిసి వెళ్తున్నారు. ఈ కన్ఫ్యూజన్‌కి ఫుల్‌స్టాప్‌ పెట్టేలా ఇప్పుడు ఢిల్లీలో చర్చలు జరిగే అవకాశం కనిపిస్తోంది. జనసేనతో పొత్తు కొనసాగించడమా.. లేక తెగతెంపులు చేసుకుని భవిష్యత్ కార్యాచరణ ప్రకటించడమా.. అనేది బీజేపీ నిర్ణయం తీసుకోనుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి. 

Follow Us
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు