Andhra Pradesh: కృష్ణా జిల్లాలో సంచలనం రేపిన డబుల్‌ మర్డర్‌ కేసులో సరికొత్త ట్విస్ట్.. అది నిజమేనా?

|

Oct 08, 2022 | 8:54 PM

అతను సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. జీతానికి జీవితానికి ఢోకాలేదు. సొంతూరుకు వచ్చిన ఆయన పొరుగూరికి వెళ్లి హత్యకు గురయ్యాడు. కారణం..

Andhra Pradesh: కృష్ణా జిల్లాలో సంచలనం రేపిన డబుల్‌ మర్డర్‌ కేసులో సరికొత్త ట్విస్ట్.. అది నిజమేనా?
Murder Case
Follow us on

అతను సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. జీతానికి జీవితానికి ఢోకాలేదు. సొంతూరుకు వచ్చిన ఆయన పొరుగూరికి వెళ్లి హత్యకు గురయ్యాడు. కారణం..వివాహేతర సంబంధం. మిస్టరీ వీడింది. నిందితులు అరెస్టయ్యారు. కానీ కథ మరో టర్న్‌ తీసుకుంది. ఒక అక్రమ సంబంధం.. రెండు హత్యలకు దారి తీసింది. కృష్ణా జిల్లాలో సంచలనం రేపిన డబుల్‌ మర్డర్‌ కేసు.. ఇటు తిరిగి అటు తిరిగి.. ఏకంగా పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌కే శల్యపరీక్షగా నిలిచింది. బయట వస్తున్న ఆరోపణలు, ఖాకీవనంలో కమీషన్ల దందా నిజమేనా!

కృష్ణా జిల్లాలో సంచలనం రేపిన డబుల్‌ మర్డర్‌ కేసులో సరికొత్త ట్విస్టులు క్యూ కడుతున్నాయి. కేసు మాఫీ కోసం కమీషన్‌ మెక్కారని ఖాకీలపై ఆరోపణల దుమారం రాజుకుంది. పొగ తెరపైకి రాగానే విచారణ జోరందుకుంది. ఆ ఇద్దరు అధికారులను వీఆర్‌ కి అటాచ్ చేశారు. మరి ఇందులో నిజం ఏంటి? అసలు కతేంటి? ఓసారి చూద్దాం. వీఆర్‌లోకి. మరి నిజం ఏంటి?.. అసలు కతేంటి?

26 జులై 2022న కృష్ణా జిల్లా తోట్ల వల్లూరు మండలం ఆళ్లవారిపాలెంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ శ్రీనివాస్‌ రెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. శ్రీనివాస్‌రెడ్డి సొంతూరు ఉయ్యూరు మండలంలోని యాకమూరు. ఆళ్లవారిపాలెంకు చెందిన శ్రీకాంత్‌తో ఎప్పటి నుంచో స్నేహం వుంది. శ్రీకాంత్‌కు వివాహిత మిథునతో అక్రమ సంబంధం వుంది. ఆ విషయం శ్రీనివాస్‌రెడ్డికి తెలిసింది. తన మొబైల్‌ ఫోన్‌ మొరాయిస్తుందని ..కాస్త రిపేర్‌ చేసి పెట్టమని శ్రీనివాస్‌రెడ్డికి ఇచ్చాడు శ్రీకాంత్‌. అంతే డేటా చెక్‌ శ్రీనివాస్‌రెడ్డికి మిథునతో శ్రీనివాస్‌ ఇల్లీగల్‌ యవ్వారానికి సంబంధించిన సినిమాలు కన్పించాయి. ఇంకేముందు మిథనతో మాట కదిపాడు శ్రీనివాస్ రెడ్డి. ఇతను లైన్‌లోకి రాగానే శ్రీకాంత్‌తో నెట్‌వర్క్‌ కట్‌ చేసిందామె.

ఇవి కూడా చదవండి

ఏంటని ఆరా తీసిన శ్రీకాంత్‌కు.. మిథున-శ్రీనివాస్‌ రెడ్డిల ప్రొగ్రామింగ్‌ అర్ధమైంది. ఫ్రెండై వుండి తనకే మస్కా కొట్టాడని రగిలిపోయాడు. విధిలేని పరిస్థితుల్లో బెండవ్వాల్సి వచ్చిందని మిథున వలపు కన్నీరు కార్చింది. ఆమెతో శ్రీనివాస్‌రెడ్డికి ఫోన్‌ చేయించాడు శ్రీకాంత్‌. తోటకు వెళ్తున్నానని చెప్పి మిథున ఇంట్లో వాలాడు శ్రీనివాస్‌ రెడ్డి. అంతే శ్రీకాంత్‌ తన ప్లాన్‌కు పదను పెట్టాడు. శ్రీనివాస్‌రెడ్డిని హత్య చేసి మిథునతో కలిసి పరారయ్యాడు శ్రీనివాస్ రెడ్డి. అప్పట్లో ఈ ఘటన సంచలనం రేపింది. ఈ కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు.. శ్రీకాంత్‌ రెడ్డి, మిథునలను అరెస్ట్‌ చేసి రిమాండ్‌ కు పంపారు.

అయితే, శ్రీకాంత్‌-మిథునల అరెస్ట్‌తో కేసు క్లోజ్‌ అనుకుంటే నరేందర్‌ రెడ్డి ఎంట్రీతో కత మరో టర్న్‌ తీసుకుంది. ఇసుక వ్యాపారం, సెటిల్మెంట్‌లు, పైరవీల్లో దిట్ట అయిన నరేందర్ రెడ్డి.. కేసు మాఫి చేయిస్తానంటూ శ్రీకాంత్‌ రెడ్డితండ్రిని కదిపాడు. పోలీసుల్ని మేనేజ్‌ చేస్తా..కేసు లేకుండా చూస్తానని చెప్పి కోటిన్నరకు డీల్‌ కుదుర్చుకున్నాడు. రూ. 30 లక్షలు అడ్వాన్స్‌ కూడా తీసుకున్నాడనేది టాక్‌. అందులో రూ. 22 లక్షలకు పోలీసులకు ముట్టచెప్పాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. మరి కేసు మాఫీ కోసం బేరసారాలు నిజమేనా? ఖాకీలు రూ. 22లక్షలు పుచ్చుకున్నది నిజమేనా? అనే విషయం బయటకు పొక్కకుండా ఇంటర్నల్‌ విచారణ జోరందుకుందనే టాక్‌ తెరపైకి వచ్చింది.

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ శ్రీనివాస్‌ మర్డర్‌ కేసులో లంచాల వ్యవహారం వివాదాస్పదంగా మారిన క్రమంలో మరో ఘటన సంచలనం రేపింది. పుచ్చకాయల శ్రీనివాస్‌ అనే వ్యక్తిని దారుణంగా హత్య చేసి డెడ్‌బాడీని ఓ చెరువు పక్కన పాతిపెట్టారు నిందితులు. కానీ దర్యాప్తులో శవంతో పాటు నిజం కూడా బయటపడింది. కేసు మాఫి చేస్తానని కోటిన్నర డీల్‌ మాట్లాడిన నరేందర్‌ రెడ్డి లింకుల డొంక ఇక్కడ కూడా కదిలింది.

సాఫ్ట్‌వేర్‌ శ్రీనివాస్‌రెడ్డి హత్య కేసు మాఫీ కోసం నిందితుడు శ్రీకాంత్‌ తండ్రితో నరేందర్‌ కోటిన్నరకు డీల్‌ కుదుర్చుకున్నాడు కదా.. ఆ విషయం పుచ్చకాయల శ్రీనివాస్‌కు తెలిసింది. ఇతను కూడా ఇసుక వ్యాపారే. జైల్లో ఉన్న శ్రీకాంత్‌ను కలిసి.. ఈ కేసును క్లోజ్ చేయడానికి కోటిన్నర ఇవ్వాల్సిన పనిలేదని.. తాను కేవలం రూ. 30 లక్షల డీల్ తోనే కేసు క్లోజ్ చేస్తానని చెప్పాడు. ఈ ముచ్చట కాస్తా నరేందర్‌ రెడ్డి చెవిన పడింది. తన బేరం చేజారిపోతుందని ఖతర్నాక్‌ స్కెచ్చేశాడు. ఓ డీల్‌ ఉందని కబురు పంపి.. పుచ్చకాయల శ్రీనివాస్‌ను ట్రాప్‌ చేశాడు. తన గ్యాంగ్‌తో కలిసి హత్య చేశాడు. శవాన్ని పాతిపట్టారు. కానీ దర్యాప్తులో శవంతో పాటు నిజాల్ని వెలికి తీశారు పోలీసులు.

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ శ్రీనివాస్‌రెడ్డి హత్య కేసు మాఫీ కోసం నరేందర్‌ రెడ్డి డీల్‌.. పోటీగా సీన్‌లోకి శ్రీనివాస్‌.. వెరసి మరో మరో మర్డర్‌.. ఈ రెండు కేసుల్లో నిజాలు తేలాయి. కానీ కేసు మాఫీ వ్యవహారంలో ముడుపుల ముచ్చట ఏంటి? రూ. 22 లక్షలు పుచ్చుకున్నది ఎవరు? ఖాకీవనంలో కమీషన్‌ దందా నిజమేనా? కరప్షన్‌ ఖాకీల డేటా రివీలైందా? అనే వివరాలు తేలాల్సి ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..